జబర్దస్త్ షో లో హైపర్ ఆది కి వచ్చినంత పేరు మరే కమెడియన్ కి రాలేదు అంటే అతిశయోక్తి కాదు. కొద్దిరోజుల పాటు అయితే హైపర్ ఆది అంటే జబర్దస్త్…. జబర్దస్త్ అంటే హైపర్ ఆది అన్నట్లు సాగింది అతని హవా. కేవలం అతని కోసమే టీవీలు ఆన్ చేసేవారు. ఆదికి ఆ క్రేజ్ కూడా అతి కొద్ది కాలంలోనే రావడం విశేషం.
ఇక ఎప్పుడూ ఆది తో పోటీపడే సీనియర్ టీం ‘సుడిగాలి సుధీర్’ స్కిట్ జబర్దస్త్ లోనే ఫేమస్. అయితే హైపర్ ఆది ఈ మధ్య ఒక అమ్మాయి ని తీసుకువచ్చి తన భార్య క్యారెక్టర్ ఇచ్చి బాగానే వినోదాన్ని పండిస్తున్నాడు. స్కిట్ లో ఇక హైపర్ ఆది పంచులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని టీంలో మిగతా సభ్యులు కూడా ఆయన వేసే పంచలు చూసి అక్కడికక్కడే నవ్వేస్తారు. ఆ రేంజిలో ఉంటాయి అతని సెటైర్లు.
సభ్యుల ఒంటి తీరు, అలాగే వారు బయట ఏదైనా వివాదంలో ఇరుక్కున్నా…. దాన్ని పట్టుకొని వారిని ఏడిపించేస్తాడు. దొరబాబు బ్రోతల్ కేసులో అడ్డంగా దొరికిపోయిన విషయం గుర్తు ఉంది కదా దాని వాస్తవాల గురించి ఎవరికీ తెలియదు కానీ ఆ సంఘటన మాత్రం హైపర్ ఆది కామెడీ కోసం భయంకరంగా వాడుకుంటాడు.
దొరబాబు అలాంటి సినిమాలు చేసి వచ్చాడని ఇండస్ట్రీలో పేరుంది. అతను స్టేజి పైకి వస్తే చాలు…. ఆ ఘటనలను గుర్తు చేయడం…. కామెడీ క్రియేట్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ఇక లాభం లేదు అనుకుందో ఏమో తెలియదు కానీ దొరబాబు భార్య రంగంలోకి దిగింది. దొరబాబు ని స్కిట్ మధ్యలో దంచేసిండి. ఆది మధ్యలోకి వస్తే….అస్లు మా ఆయనను నువ్వే పెంట పెంట చేస్తున్నామంటూ ఆదిని కూడా కొట్టేసింది. ఇదంతా స్కిట్ లో భాగం అయినప్పటికీ ఆమ్వె పగ పెట్టుకొని మరీ కొట్టినట్లు కనిపిస్తుంది. ఇది అసలు మేటర్..!
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!