NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sufficient Food: మీరు తక్కువగా తింటున్నారడానికి సూచనలు ఇవే..!!

Sufficient Food: ఎక్కువగా తింటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అందరికి తెలిసిందే.. ఎక్కువగా తినడం వలన అధిక బరువు, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.. అయితే శరీరానికి కావలసిన ఆహారం తీసుకోకపోయినా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎక్కువ మందికి తెలియక పోవచ్చు..!! ఆకలిగా లేకపోయినా, సరిగ్గా తినక పోయినా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.. సరిగ్గా ఆహారం తీసుకోకపోతే శరీరంలో జరిగే దుష్ప్రభావాలు గురించి తెలుసుకుందాం..!!

If you don't take Sufficient Food: see what happens
If you dont take Sufficient Food see what happens

 

మీరు తక్కువ మొత్తం లో ఆహారాన్ని తీసుకుంటే మీ శరీరం లో స్థూల పోషకాలు, కేలరీలు తగ్గుతాయి. ఇవి తగ్గడం వలన రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. శరీరం యొక్క మొత్తం పనితీరు మందగిస్తుంది. ఇలా తక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల మీ శరీరానికి తగినంత శక్తి లభించదు. శరీరానికి తగినంత శక్తి అందటం లేదని ముందు గానే కొన్ని సూచనలు కనిపిస్తాయి . వాటిని బట్టి మనం మన డైట్ ను తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తగినంత తినటం లేదని ముందుగా హెచ్చరించేది జుట్టు రాలడం. జుట్టు పెరుగుదలకు బయోటిన్, ఐరన్ పోషకాలు అవసరం. మీరు చాలీచాలని ఆహారం తీసుకోవడం వలన ఈ పోషకాలు శరీరానికి అందకపోవడం వలన జుట్టు రాలడం మొదలవుతుంది. తగిన అంతా ఆహారం శరీరానికి అందడం లేదని సూచించిన మరో లక్షణం జలుబు. అంతే కాకుండా శరీరం అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల శరీరం లోకి అనేక వైరస్ లు ఎటాక్ అవుతాయి.

If you don't take Sufficient Food: see what happens
If you dont take Sufficient Food see what happens

తగినంత ఆహారం తీసుకోక పోవడం వలన మలబద్ధకం కూడా వస్తుంది. శరీరానికి తగినంత ఆహారం అందకపోతే ఆ ప్రభావం థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి థైరాయిడ్ హార్మోన్లు అవసరం. ఈ హార్మోన్లు సరిగా పని చేయకపోతే మలబద్ధకం సమస్య వస్తుంది. తగినంత ఆహారం తీసుకోకపోతే గర్భధారణ కోసం ఎదురు చూస్తున్న మహిళలు గర్భధారణ పొందలేరు. తక్కువ కేలరీలు తీసుకోవడం వలన మీ పునరుత్పత్తి వ్యవస్థను, గర్భధారణ సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. ఆహారం తీసుకోవడం తగ్గటం వలన రక్తం లో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇది డయాబెటిస్ కు కారణం కావచ్చు. దీనివలన మీ భావోద్వేగాలను నియంత్రించుకోలేక పోతారు. అధిక రక్తపోటు కు కారణమవుతుంది. ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇటువంటి లక్షణాలు మీకు కనిపిస్తే మీ డైట్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. మీ డైట్ లో ఎక్కువగా ప్రోటీన్, కెలోరీలు, ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి తగినంత ఆహారాన్ని అందించాలి. లేకపోతే కావాలని మీ చేతులతో మీరే మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న వారు అవుతారు.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N