Krishna Lanka: రంగు సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ దర్శకత్వంలో కృష్ణలంక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా లో పరుచూరి రవి, నరేష్, మేడి, ఆదర్శ్, రఘు, పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అందరినీ పరిచయం చేస్తూ ఓ ఇంట్రో వీడియోను విడుదల చేశారు..

Read More: HBD Nikhil: నిఖిల్ బర్త్ డే స్పెషల్ 18 పేజెస్ ఫస్ట్ లుక్ అదుర్స్..!!
తాజాగా విడుదలైన ఇంట్రో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాలో కొన్ని సన్నివేశాలలో వారి పాత్రలను పరిచయం చేశారు.. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.. ఈ సినిమాను యూరో ఫిక్స్ ఎంటర్టైన్మెంట్, సోహ్లా ప్రొడక్షన్స్, చేతన్ రాజ్ ఫిలిమ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఈచిత్రానికి నగరం దర్శకుడు ఫేమ్ రాజ్ గౌరవ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయ రంగు సినిమా ఎంత ప్రజాదరణ పొందిందో.. కృష్ణలంక సినిమా అంతకంటే రెట్టింపు ఆదరణ లభిస్తుందని ఇంట్రో చూస్తే అర్థమవుతుంది.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.