Bigg Boss 5 Telugu: సరియూ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే అంటున్న జనాలు..!!

Share

Bigg Boss 5 Telugu: సరియూ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఇంటి నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. దాదాపు పోయిన వారం 19 మంది కంటెస్టెంట్ లు హౌస్ లో అడుగు పెట్టగానే.. ఏడుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఈ క్రమంలో వీరిలో సరియూ కూడా ఉండటం జరిగింది. సోషల్ మీడియాలో బోల్డ్ డైలాగులు చెబుతూ మంచి పాపులారిటీ సంపాదించిన.. సరియూ కి.. ఓట్లు తక్కువ పడటంతో ఆదివారం ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఈ క్రమంలో.. సరియూ హౌస్ నుండి వెళ్తున్న సమయంలో.. ఇంటిలో చాలామంది బాధపడ్డారు. డి సభ్యులందరి కల్లా విశ్వా తట్టుకోలేకపోయాడు. హౌస్ లోకి వెళ్లి వెక్కి వెక్కి అడగడం జరిగింది. ఇదే సమయంలో మీద కూడా బాగా ఎమోషనల్ అయ్యింది. మరోపక్క చివరిసారిగా ఇంటిని విడిచి పెడుతూ సరియూ… విశ్వా కి గట్టిగా హాగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భావోద్వేగంగా ఇంటి నుండి సరియూ బయటకు వెళ్ళిపోయింది.

Bigg Boss Telugu 5: Sarayu Evicted From Bigg Boss Show - Sakshi

ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో సరియూ ఎలిమినేషన్ కి గల కారణాల గురించి బిగ్ బాస్ ఆడియన్స్ తో పాటు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా సరియూ కి తక్కువ ఓట్లు పడటానికి గల కారణం ఆమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ మొదటి వారంలో లభించింది చాలా తక్కువ అని… కనిపించిన సందర్భాలు కూడా ఆమెపై నెగిటివ్ క్రియేట్ అయ్యేలా సన్నివేశాలు కనిపించాయని ఆడియన్స్ అంటున్నారు. ఇక ఆమె ఆట తీరు చూస్తే… సరైన అవగాహనతో ఆడ లేదని తెలుస్తోంది. తనని నామినేట్ చేసిన మానస్, కాజల్, సన్నీ ఈ ముగ్గురిలో ఏ ఒక్కరిని కూడా నామినేట్ చేయలేకపోవడం ఆమెకు మైనస్ అయిందని అందు వల్లే ఆమె ఎలిమినేట్ అయిందని బయట జనాలు అంటున్నారు. ఇక హౌస్ లో అడుగుపెట్టిన టైంలో.. అనవసరమైన విషయాల్లో తగాదా పెట్టుకోవటం మాత్రమే కాక.. కెప్టెన్సీ టాస్క్ లో.. కాజల్ విశ్వాన్ని టార్గెట్ చేసిన సమయంలో సరియూ చేసిన రచ్చ.. ఆమెకు మైనస్ పాయింట్స్. ఆ టైంలో సరిగ్గా గేమ్ అర్థం చేసుకోకుండా సరియూ అనవసర రాద్ధాంతం కింద కాజల్ తో .. ఆమె గొడవకు దిగడం జరిగిందని అంటున్నారు.

 

ఇక ఇదే సమయంలో… తనతోపాటు నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ ల తో పోటీ పడాల్సిన సరియూ… పార్టీని పెద్దగా పట్టించుకోకుండా… ఇంటి పనుల పైన ఎక్కువ శ్రద్ధ పెట్టడం.. వంటి వాటివి మీదే ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఆమె కి.. తక్కువ ఓట్లు వచ్చాయని ప్రేక్షక ఆదరణ దక్కలేదని ఓట్లు రాబట్టలేకపోయింది అని.. ఒక విధంగా చూసుకుంటే ఇన్నోసెంట్ గేమ్ సరియూ ఆడిందని అందువల్లే ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అయిందని జనాలు విశ్లేషిస్తున్నారు. ఇక హౌస్ లో బూతులు మాట్లాడటం ఇంకా స్మోకింగ్ అనేది ఆమె వ్యక్తిగత జీవితనికి సంబంధించిన విషయం ఈ క్రమంలో ఈ షో బయట కుటుంబ పరంగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు వారి మద్దతు కూడా ఈ టైంలో ఆమెకు దక్కలేదని.. పైగా బూతులు మాట్లాడటం కూడా జనాలకు నచ్చకపోవటం వల్ల…సరియూ కి పెద్దగా ఓట్లు రాకపోవటం తో పాటు ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ అయిందని జనాలు ఆమె ఎలిమినేషన్ ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన సరియూ.. మొదటి వారంలోనే ఎలిమినేట్ కావటం సంచలనంగా మారింది.


Share

Related posts

SEC : ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా కన్నబాబు

somaraju sharma

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తరువాత సంచలన వ్యాఖ్యలు చేసిన బోస్..!!

sekhar

దుబ్బాక రిజల్ట్ ఎఫెక్ట్ ప్రజలలోకి కేసిఆర్..??

sekhar