RRR Dosti: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్.. ఈరోజు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా “దోస్తీ” సాంగ్ ను విడుదల చేశారు..!! కీరవాణి సారథ్యంలో ఐదు భాషలకు చెందిన అయిదుగురు సంగీత యువ కెరటాలు ఈ పాటను హుషారెత్తించేలా పాడారు..!! దోస్తి సాంగ్స్ విడుదలైన ఆరు గంటల్లోనే యూట్యూబ్ లో #TrendingNO.1 గా నిలిచి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది..!! ఇప్పటి వరకు ఏ చిత్రం నుండి విడుదలైన పాట ఇంకా తక్కువ సమయంలో #NO.1 నిలవలేదు.. అలాగే తెలుగులో 3.9 మిలియన్ వ్యూస్, 431K లైక్స్ ను సొంతం చేసుకోవడం విశేషం..!!

పులికి వీలుగాడికి.. తలకి ఉరితాడుకి.. కదిలే కార్చిచ్చుకి.. కసిరే బడగళ్ళకి.. రవికి మేఘానికి.. దోస్తీ ఊహించని చిత్రమే చిత్రం.. అంటూ సాగే ఈ పాట ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మధ్య స్నేహాన్ని ప్రతిబింబించేలా ఉంది.. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించగా, ఎంఎం కీరవాణి సారథ్యంలో తెలుగులో హేమచంద్ర, తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీ విజయ్ ఏసుదాసు, మలయాళంలో అమిత్ త్రివేది, కన్నడ భాషలో యాజిన్ నైజర్ ఆలపించారు.. ఈ థీమ్ సాంగ్ చివరిలో లో ఎన్టీఆర్ రామ్ చరణ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం స్పెషల్ అట్రాక్షన్.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు.. వీరి సరసన ఒలీవియా మోరిస్, ఆలియా భట్ నటిస్తున్నారు.. ఎం ఎం కీరవాణి అందించిన బాణీలు ఈ పాటకు హైలెట్ గా నిలిచాయి.. గాయకులు ప్రతి ఒక్కరు వారి వారి భాషల్లో అద్భుతంగా ఆలపించారు.. అందువల్లనే యూట్యూబ్ లో విడుదలైన అతికొద్ది గంటల్లోనే #TrendingNO.1 నిలిచి సినిమాపై అంచనాలు తారా స్థాయికి తీసుకెళ్లింది..
ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి ఈ పాటతో.. ఈ సినిమాలో రేయ్ స్టీవ్ సన్, అలిసన్ డ్యూడీ, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలలో నటిస్తున్నారు.. ఇటీవల ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది.. తాజాగా విడుదలైన దోస్తీ లిరికల్ వీడియో సాంగ్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది..!!