NewsOrbit
న్యూస్

మోడీ ఇచ్చినా జగన్ తీసుకుంటారా ?

కేంద్రమంత్రివర్గంలో జేడీయూతోపాటు వైసీపీకి కూడా చోటు కల్పించాలనే ఉద్దేశం బీజేపీ పెద్దలకు ఉందన్న ప్రచారం ఢిల్లీలో మొదలైంది.. ఎందుకంటే పార్లమెంట్ లో ఎంపీల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద 4వ పార్టీ వైసీపీనే.

 

సీఎం జగన్-మోడీ భేటి జరిగినప్పుడల్లా బీజేపీ కేబినెట్ లో వైసీపీ చేరికపై ఊహాగానాలు వ్యక్తమయ్యేవి.  కానీ జగన్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు..

బీజేపీ ఆఫర్ ఇచ్చినా వైఎస్ జగన్ తీసుకునే పరిస్థితుల్లో లేరని సమాచారం. ఎందుకంటే వైసీపీ ఏజెండానే ఏపీకి ప్రత్యేక హోదా.. కేంద్రంలో హోదా ఇచ్చేపార్టీతోనే కలుస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. బీజేపీ ఇవ్వనని చెప్పింది. దీంతో ఆ పార్టీతో జగన్ కలవరు అంటున్నారు వైసీపీ వర్గాలు. రెండు కేంద్రమంత్రి పదవుల కోసం జగన్ తాకట్టు పెట్టరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

పైగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దళితులు మైనార్టీలు వైసీపీకి దూరం అవుతారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఎట్టిపరిస్థితుల్లోనూ  బీజేపీ కేంద్రంలో చేరాలన్న చేరరు అని పార్టీ వర్గాల వారు అంటున్నాయి. అందుకే కేంద్ర కేబినెట్ లోకి జేడీయూతోపాటు వైసీపీకి ఆఫర్ ఇచ్చినా జగన్ సున్నితంగా తిరస్కరించే అవకాశాలే ఎక్కువ అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.రాష్ట్రాల ఎన్నికలు ముంచుకొచ్చే ప్రతీసారి కేంద్రంలోని బీజేపీ పాచిక వేస్తుంది. ఆయా రాష్ట్రాలకు పెద్దపీట వేస్తుంది. కోట్ల నిధులను విడుదల చేస్తుంది. ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు ఎరవేస్తుంది. అవసరమైతే కేంద్ర కేబినెట్ లోకి చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెడుతుంది. బీజేపీ గద్దెనెక్కినప్పటి నుంచి అలాగే శివసేన జేడీయూ అన్నాడీఎంకే హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ఇలానే చేర్చుకొని ఆయా రాష్ట్రాల్లో అధికారం కొల్లగొట్టింది.

ఇప్పుడు అదే ఫార్ములాను మళ్లీ తెరపైకి తెస్తోంది. ప్రస్తుతం బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే మిత్రపక్షం జేడీయూని దువ్వేపనిలో బీజేపీ పడింది. ఇదివరకు కేంద్ర మంత్రిపదవుల్లో తమకు వాటా సరిగా ఇవ్వలేదని జేడీయూ అధినేత నితీష్ అలిగి అప్పట్లో మోడీ కేబినెట్ నుంచి వైదొలిగారు. కానీ ఇప్పుడు ఇద్దరి అవసరం కావడంతో మరోసారి తప్పనిసరి పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల వేళ జట్టు కడుతున్నారు. ప్రధాని కూడా జేడీయూని కేబినెట్ లోకి తీసుకొని బీహార్ లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు.అదే సమయంలో వైసీపీని మిత్రపక్షంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్లో బిజెపి తన హవా చెలాయించాలని చూస్తోందని,రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే జగన్ ఆ ట్రాప్ లో పడే అవకాశాలు తక్కువ అంటున్నారు .





Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju