సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏం చేసిన సంచలనమే. ఒక ట్వీట్ చేసినా..ఎవరినైనా తిట్టినా..ఎవరినైనా పొగిడినా. ఇప్పుడు చెప్పింది తర్వాత రోజు చెప్పడు. నాకప్పుడు అలా మాట్లాడలనిపించి మాట్లాడాను అంతే అంటారు. ఇందుకు ఉదాహరణ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలే. ఇక ఇండస్ట్రీ మొత్తం లాక్ డౌన్ లో ఇరుక్కుపోతే వర్మ మాత్రం నెలకో సినిమా తీసి రిలీజ్ చేస్తున్నాడు. అంతేకాదు అందమైన అమ్మాయిలతో యూత్ కి ఎరవేసి వెర్రివాళ్ళని చేస్తున్నాడు.
సినిమా ఇండస్ట్రీలో కాస్ట్యూమ్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శ్రీరాపాక గురించి ఎవరికి తెలియదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కాని రాం గోపాల్ వర్మ ఎప్పుడైతే బోల్డ్ హీరోయిన్ గా నటించిందో అప్పటి నుండి క్రేజీ హీరోయిన్ గా పాపులర్ అయింది. ఎలాంటి వాళ్ళనైనా స్టార్స్ చేయగల సత్తా ఒక్క వర్మకే ఉందనడానికి శ్రీరాపాక ఇప్పుడు అందరికీ కనిపిస్తున్న ఉదాహరణ. అంతేకాదు గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది అప్సర రాణి. ఇప్పటికే రెండు సినిమాలు చేసిన అంకిత మహారాణ నే ఇప్పుడు అప్సర రాణి గా వెలుగులోకి వచ్చింది. ఇది కూడా వర్మ పుణ్యమే.
ఇక శ్రీ రాపాక పవన్ అంటే ఎంత ఇష్టమో అభిమానమో వెల్లడించింది. పవన్ కళ్యాణ్ అంటే క్రష్.. ఆయన ఎప్పుడు డేటింగ్ కు పిలిస్తే అప్పుడు ఆలోచించకుండా వెళ్ళిపోతా అంటూ బోల్డ్ గా వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు కనీసం ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలన్నది తన కోరిక అని తెలిపింది. ఇప్పటికే ఆ ప్రయత్నాలు చేసి విఫలమైనట్టు తెలిపింది శ్రీ రాపాక. పవన్ కళ్యాణ్ పై శ్రీరాపాక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. అంతేకాదు తను ఇలాంటి కామెంట్స్ చేయడానికి వెనక ఎవరైనా ఉన్నారా అంటూ కొందరు ఆరా తీస్తున్నారట.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!