NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

జగన్ తో పనిలేదు… కేసీఆర్ అంటే లెక్కలేదు..! అసలు ఏపీలో కరోనానే లేదు

మీరు రోజూ కరోనా హెల్త్ బులిటెన్ ను ఫాలో అవుతున్నట్లు అయితే తెలంగాణ రాష్ట్ర హెల్త్ బులిటెన్ మరియు ఆంధ్ర రాష్ట్ర హెల్త్ బులిటెన్ కి మధ్య తేడాను గమనించవచ్చు. అయితే ఎంత కాదన్నా గ్రేటర్ హైదరాబాద్ వంటి మహానగరం వలన తెలంగాణలో కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా కరోనా రోజురోజుకి పెరిగిపోతుంది కానీ మన మీడియా వారికి మాత్రం కేవలం హైదరాబాద్ కేసులే కనిపిస్తాయి. వాటి ద్వారానే వారు తమ ఛానల్ రేటింగ్ పెంచుకుంటారు కానీ ఏపీ లో జరుగుతున్న దారుణాన్ని మాత్రం ప్రజల కళ్ళకు కనపడనివ్వరు.

 

 

Coronavirus and the media: In times of crisis, a democracy needs a ...

వివరాల్లోకి వెళితే నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కారణంగా 38 మంది చనిపోయారు అంటే అది మామూలు విషయం కాదు. ఇక ఈ రోజున 43 మంది ఈ వైరస్ సోకి మృత్యువాత పడటం గమనార్హం. దీనిని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో వైద్య సదుపాయాల కొరత మరియు డాక్టర్ల యొక్క వైఫల్యత ఎంత మాత్రం ఉందో అందరికీ అర్థమవుతుంది. నిజానికి డాక్టర్ల వైఫల్యత అనడం కన్నా ప్రభుత్వం వైరస్ సోకిన వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని చెప్పడం ఇంకా సముచితంగా ఉంటుందేమో. కానీ ఏ ఒక్క మీడియా ఛానల్ కానీ ఈ విషయాన్ని అసలు హైలెట్ చేయకపోవడం ఇక్కడ గమనార్హం.

ఏమన్నా అంటే జగన్ రోజుకి వేలాది వేల కరోనా టెస్టులు చేయిస్తున్నారు ఇక అంతకుమించి ఏ పాలకుడు మాత్రం ఏం చేయగలడు అన్నట్లు స్క్రోలింగ్ లు వేస్తారు. ఇక రోజుకొక రికార్డు నమోదు అవుతుంటే అసలు ఏపీ లో కరోనానే లేదన్నట్లు వార్తలు తాపీగా చెబుతారు. కానీ తెలంగాణాకు వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతుంది. చిన్నదైనా పెద్దదైనా.. ఆ విషయాన్ని తిప్పి తిప్పి హైలైట్ చేయాల్సిందే. అసలు డబ్ల్యూహెచ్వో కరోనా అనివార్యం అన్నట్లు చెపోంది. ఇప్పుడిప్పుడే ఇది పోదు అని కూడా నొక్కి వక్కాణిస్తున్న ఈ సమయంలో వీలైనన్ని ఎక్కువ ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర వైద్య శాఖ మరియు ఆరోగ్య శాఖ పని చేయాలి. 

కానీ టెస్టులు జరుపుకుంటూ అందులో పాజిటివ్ వచ్చిన వారిని గాలికి వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమిటని ఇక్కడ వైద్య నిపుణుల ప్రశ్న. ఇవే ఫలితాలు కనుక తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఉంటే ఈపాటికి కేసీఆర్ పైన మీడియా విపరీతంగా దుమ్మెత్తిపోసేది. ఇప్పుడు చేస్తున్న హంగామా కన్నా రెట్టింపు చేసే వారు. మరి జగన్ కు మాత్రం డ్రామా నియమాలు వర్తించవా? అంటే జగన్ తో వీరికి పని లేదా.. లేక కేసీఆర్ అన్నా ఆంధ్ర ప్రజల ప్రాణాలన్నా లెక్క లేదా..? అసలు ఏపీ లో జరుగుతున్న ఘోరాన్ని చూపే మీడియానే లేదా? ఇవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సామాన్యుడి ప్రశ్నలు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju