NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పేరు చెప్పి కే‌సి‌ఆర్ ని కొత్త డిమాండ్ చేశారు .. ‘ వామ్మో ‘ అనుకున్నాడు ! 

రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కి కరోనా రూపంలో చుక్కలు కనపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో సిఎం కేసీఆర్ విఫలమయ్యారని ప్రతిపక్షాలు నుండి సామాన్యుల వరకూ అందరూ బలంగా నమ్ముతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఓ దళిత రైతు మృతి టిఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోనీ వర్గాల మండలం వేలూరు గ్రామంలో దళిత రైతు నరసింహులు ఆత్మహత్య కేసీఆర్ సర్కార్ ని ముప్పుతిప్పలు పెడుతోంది. నరసింహులు అనే రైతుకు చెందిన 13 గుంటల భూమిని రైతు వేదిక భవనానికి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు కోరారు.

 

Nizam's Family Shocks KCRఅయితే ఈ సమయంలో ఆయన భూమి రికార్డు లోకి కూడా ఎక్కలేదు. దాంతో పొలం దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నరసింహులు మృతి చెందటంతో….నరసింహులు సొంత భూమిని రైతు వేదిక భవనానికి ఇవ్వాలని రెవెన్యూ అధికారుల ఒత్తిడి వల్లే ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే టైమ్ లో ప్రతిపక్ష పార్టీలు కూడా కేసిఆర్ సర్కార్ తీరు వల్లే ఈ ఘటన జరిగినట్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి.

 

పరిస్థితి ఇలా ఉండగా ఇది ప్రభుత్వ హత్య కాబట్టి ఏపీలో విశాఖపట్టణం ఎల్జి పాలిమర్స్ ఘటన లో మృతి చెందిన వారికి అక్కడ సీఎం జగన్ ఏ మాదిరిగా ప్రభుత్వం తరఫున కోటి నష్టపరిహారం అందించాడో….అదే రీతిలో నరసింహులు కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా కేసిఆర్ ఇవ్వాలని విపక్షాలు కోరుతున్నాయ. అంతేకాకుండా మృతుడి కూతురుకి ప్రభుత్వం తరపున ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేయడంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్లు విని వామ్మో అని అవాక్కవుతున్నారట.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?