NewsOrbit
బిగ్ స్టోరీ

శుభం గోరంత,అశుభం కొండంత

ముహూర్త బలం లేకపోవడం వల్లే అమరావతికి సంకటం..ప్రతి అంశానికి ముహూర్తాలు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయ్.

 

ముహూర్తబలం కారణంగా పలానా వ్యవహారం సూపర్ సక్సెస్ అవుతుందని.. లేదంటే సరైన ముహూర్తం లేకపోవడం వల్ల పలానా వ్యవహారం సఫలం కాదని జ్యోతిష్యాస్త్ర పండితులు చెబుతుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శంకుస్థాపన జరిగిన ముహూర్తంలో శుభం గోరంత, అశుభం కొండంత ఉన్నాయంటున్నారు జ్యోతిష్యులు. అక్టోబర్ 22, 2015 మధ్యాహ్నం 12.45 నిమిషాలకు చేసిన ముహూర్తం సరైనది కాకపోవడం వల్లే ఇప్పుడు అమరావతి వ్యహారంలో ఒక అడుగు ముందుకు… మరోక అడుగు వెనక్కిపడుతుందంటున్నారు.

ఇక దోషం ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. అక్టోబర్ 22న మధ్యాహ్నం 12.45 నిమిషాల సమయంలో ముహూర్తం ఖరారైనందున ఆ సమయంలో చర రాశి మకర రాశి అయ్యిందని… ఇలాంటి సమయంలో ముహూర్తం పెట్టడం కరెక్ట్ కాదని జ్యోతిష్యులు తేల్చి చెబుతున్నారు. ఈ ముహూర్త బలం వల్లే రెండోసారి రాజధానికి శంకుస్థాపన చేయాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. నాడు అష్టమరాశిలో గురుడు, కుజ, శుక్ర మూడు గ్రహాలున్నాయ్. అష్టమరాశిలో ఉన్న గ్రహాలు వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయంటున్నారు. గ్రహాలలో మిక్కిలి శుభాలను కలిగించే గురు, శుక్ర గ్రహాలు రెండూ కూడా అష్టమరాశిలో ఉండటం వల్ల ఎలాంటి శుభమన్నది జరగదని… అన్నీ ప్రతికూల ఘటనలే జరుగుతాయంటున్నారు. శుభం సంగతి పక్కనబెడితే… అన్నీ అశుభ ఫలితాలను కలిగిస్తాయి. లగ్నానికి అస్సలు బలమే లేకపోవడంతోపాటు… లగ్నంలో చంద్రుడు ఉండట వల్ల మహా దోషకారి అని శాస్త్రం చెబుతోంది. నవాంశ లగ్నాధిపతి గురు గ్రహంగా ఉండటం ఇప్పటి అనర్థాలకు కారణమంటున్నారు. అనగా రాశి చక్రం… నవాంశ చక్రం రెండూ అష్టమ స్థానంలో ఉండటం ఎక్కువ సంక్షోభాలను కలిగిస్తాయని…
అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు బీజం నాడు శంకుస్ఖాపన రోజే జరిగిందని… ఇది మహా దోషమంటూ వారు వివరిస్తున్నారు. అదే సమయంలో నవాంశలగ్నానికి అష్టమంలో రవి, కుజ గ్రహం ఉన్నాయంటున్నారు. అనగా అష్టమంలోనే మూడు గ్రహాలు అనర్థమంటూ తేలుస్తున్నారు. రాశి చక్రంలోనూ, నవాంశ చక్రంలోనూ, అష్టమ రాశిలో మూడు గ్రహాలుండటం వల్ల ఈ ముహూర్తానికి ఎలాంటి ఆయుష్సు లేదని చెబుతున్నారు. రాశి చక్రం వే లోనూ, నవాంశ చక్రం లోనూ
అష్టమ స్థానం లో మూడు గ్రహాలు ఉండుట వలన ఈ లగ్నానికి ఎలాంటి ఆయుష్షు లేదు. గ్రహ రాజు ఐనా రవి గ్రహం రాశి చక్రంలో ను, నవాంశ చక్రం లోనూ నీచ స్థానం లో ఉన్నాడు. అందువల్ల రవి గ్రహం ఎలాంటి శుభ ఫలితాన్ని ఇవ్వదు.

ఇక శనిహారలో ముహూర్తం పెట్టడమంటే… అన్నీ వదులుకోవాల్సిందేనని… త్యజించాలన్న సంకేతం అదే ఇస్తుందంటున్నారు. శనిహోరలో శుభముహూర్తం ఉంచకూడదని… అందువల్ల శుభాలు జరగవంటున్నారు. కానీ అదే సమయంలో అశుభ ఫలితం మాత్రం కొండంత ఉంది. రాజధాని విషయంలో గొడవలు, చర్చలు జరిగి ప్రశాంతత లేకుండా ప్రజలు అల్లకల్లోలం అయిపోయారు. ప్రజల కోరికలు తీరకపోవడానికి కారణం ఇదేనంటున్నారు పండితులు.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju