NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ ఎంపీ ఎప్పుడు ఏం బాంబు వేస్తారో…??

 

రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారుతోంది. గడిచిన రెండు నెలల నుంచి మీడియాలోనూ, వైసిపి వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా ఉన్న కృష్ణంరాజు వార్తలు రోజు రోజుకి నానారకాలుగా హల్ చెల్ చేస్తూనే ఉన్నాయి. వైసీపీ వ్యవహారాలు ఎంతో కొంత అంతర్గతంగా తెలిసిన ఆయన ఏ రోజు ఏ బాంబు వేస్తారో అనే ఆందోళన కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. రోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ లు పెట్టడం, రోజుకో రకమైన విమర్శ చేయడం చివరలో ముఖ్యమంత్రి జగన్ అంటే తనకు అభిమానమని, పార్టీ అంటే గౌరవం అని చెప్పి ముగించడం రఘురామ కృష్ణంరాజు అలవాటుగా మారింది. తాజాగా వాలంటీర్ ల వ్యవస్థ సరిగా పని చేయడం లేదని, విచారణ చేయించాలని ఢిల్లీ వేదికగా అయన కోరారు.

Ycp mp raghurama krishnam raju contrivarcy comments

 

అయన ఏమన్నారంటే..

కరోనా కేసుల సంఖ్య పెరుగుదల, కరోనా మరణాల నమోదులో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం అన్నట్లుగా విమర్శించారు రఘురామ కృష్ణంరాజు. కరోనా ప్రారంభంలో వైరస్ వ్యాప్తి కట్టడికి వాలంటీర్ ల వ్యవస్థ చాలా బాగా పని చేస్తోందని ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతుండటంపై ఎవరిని బాద్యులు చేస్తారని ప్రశ్నించారు. కరోనా కేసుల రికవరీలో రాష్ట్రం చాలా వెనుక బడి ఉందన్నారు. కరోనా తగ్గేందుకు వాలంటీర్ ల వ్యవస్థ కారణం అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ఆ వ్యవస్థ పై విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో రిటైర్ ఉద్యోగుల పెన్షన్ ల చెల్లింపులు ఆలస్యం అయ్యాయని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారని చెబుతూ..ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి ఈ విధంగా ఉంటే విశాఖ, కర్నూలు నగరాలను రాజధానులుగా ఎలా అభివృద్ధి చేస్తారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మూడు రాజధానుల అంశంbపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో సవాల్ చేయడం సరైన చర్య కాదని అన్నారు రఘురామ కృష్ణంరాజు.

రఘురామ కృష్ణంరాజు ఎంపీగా గెలిచిన కొద్ది నెలల నుండే తేడాగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటుంటే పార్టీ స్టాండ్ కు భిన్నంగా అయన లోక్ సభలో మాతృభాష పరిరక్షణపై మాట్లాడారు. అదే విధంగా లోక్ సభ ప్రవేశ ద్వారం వద్ద ప్రధాని మోడీ అయన రాజుగారు అంటూ ప్రత్యేకంగా పిలవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. మళ్ళీ అయన బీజేపీకి దగ్గర అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అనంతరం పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్..రఘు రామ కృష్ణం రాజుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ తరుణంలోనే తొలుత తన నియోజకవర్గం పరిధిలోని ఇసుక సమస్య, భూముల కొనుగోళ్లలో అవినీతి జరుగుతోంది, సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారు. అయన చర్యలపై పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి షోకాజ్ నోటిస్ ఇస్తే దానిపై వ్యంగ్యంగా ఆరోపణలు చేశారు. ఆ తరువాత రఘు రామ కృష్ణం రాజు దూకుడు పెంచారు. ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ, మరో పక్క సొంత పార్టీ నేతలతోనే తనకు ప్రాణభయం ఉందని, కేంద్ర భద్రత సిబ్బందితో రక్షణ కల్పించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిల్లాను కలిసి కోరి సాధించుకున్నారు. సీఎం జగన్ చుట్టూ కోటరీ ఉందని ఆరోపిస్తూ తమ నాయకుడిని కలుసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని అందుకే మీడియా ద్వారా విషయాలు వెల్లడిస్తున్నాని అయన సమర్ధించుకున్నారు. చాలా విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడం లేదని, సీఎంఒ లో ఒ అధికారి అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారని కూడా విమర్శించారు. అమరావతి రాజధాని విషయంలోనూ పార్టీ స్టాండ్ కు భిన్నంగానే రఘు రామ కృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు.

Related posts

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?