స్టార్ యాంకర్ అనసూయ బులితెర మీద ఒక వెలుగు వెలుగుతుంది. తను చేసే ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఒకవైపు యాంకర్ గా మరో వైపు సినిమా ఆర్టిస్ట్ గా అద్భుతమైన పాత్రలతో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. యాంకర్ గా ఉన్నప్పుడే ఒక స్టార్ హీరోయిన్స్ కి ఉన్నంత క్రేజ్ సంపాదించుకోవడం గొప్ప విషయం. ఇక ఇప్పుడు సినిమాలు కూడా చేస్తూ ఆ క్రేజ్ ని డబుల్ చేసుకుంది. అనసూయ అంటే పడి చచ్చిపోయోవాళ్ళు ఎంతమందో లెక్క పెట్టలేము.
ప్రస్తుతం అనసూయ సిల్వర్ స్క్రీన్ మీద విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. చెప్పాలంటే అనసూయ ఒప్పుకోవాలే గాని సినిమాలలో వరసగా అవకాశాలు, స్పెషల్ సాంగ్స్ చాలానే వస్తున్నాయట. అవన్ని ఒప్పుకుంటే ఇక బుల్లితెరకు గుడ్ బాయ్ చెప్పాల్సిందే. కాని అనసూయ కి ముందు లైఫ్ ఇచ్చింది స్మాల్ స్క్రీన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను వదులుకునే ప్రసక్తే లేదు. అందుకే సినిమాలలో వచ్చిన అవకాశాలన్ని కాకుండా నచ్చిన పాత్రలనే ఒప్పుకుంటుంది.
ఈ క్రమంలోనే ప్రముఖ దర్శక, నిర్మాతలు పిలిచి మరీ అనసూయకు అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే ‘క్షణం’ ‘కథనం’ ‘ఎఫ్ 2’ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ‘మీకుమాత్రమే చెప్తా’ ‘సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చెప్పాలంటే ఈ సినిమాలో సమంత తర్వాత సెకండ్ హీరోయిన్ రేంజ్ లో అనసూయ కే పేరు వచ్చింది.
ఒకవైపు చిన్న స్క్రీన్ మీద మరో వైపు సిల్వర్ స్క్రీన్ మీద అనసూయ బిజీగా బిజీగా ఉంటున్న అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని కనువిందు చేస్తూనే ఉంది. దాంతో ఇటీవల కాలంలో అనసూయ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. అందుకు కారణం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుండమే. అలాంటి రీసెంట్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమివ్వగా ఫ్యాన్స్ అందరూ తెగ షేర్ చేసేసుకుంటున్నారు. అంతేకాదు ఈ ఫొటో ని చూసుకుంటూ అనసూయ లాంటి అందగత్తె మళ్ళీ పుట్టదని ఫీలవుతున్నారట.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!