బిగ్ బాస్ షో లో గంగవ్వ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. బిగ్బాస్ ఆమెను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ధైర్యం చెప్పారు కానీ నాకు ఈ వాతావరణం పడలేదు అని గంగవ్వ అనింది. అలాగే గంగమ్మ ఆరోగ్యం కూడా క్షీణించింది వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఈ రోజు ఉదయానికి ఆమెకు సీరియస్ గా ఉందంటూ…. ఆమె ఏదో జరిగిందంటూ ఎక్కడ లేని వార్తలు బయటకి రావడంతో ప్రేక్షకులు కంగారు పడ్డారు.
అయితే బిగ్బాస్ అందరికీ మొదట్లో అలాగే ఉంటుందని గంగమ్మకు సర్ది చెప్పడమే కాకుండా ఆమెకు పూర్తిగా ధైర్యాన్ని నూరిపోశారు. నువ్వు చాలా ధైర్యవంతురాలువి అని కూడా చెప్పుకొచ్చాడు. వెంటనే డాక్టర్ రూమ్ లోకి తీసుకెళ్ళి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశాడు. గంగవ్వ ఆరోగ్య పరిస్థితి చూసి శివజ్యోతి, అలీరెజా, హిమజా ఎమోషనల్ అయిపోయి సోషల్ మీడియాలో ఆమెకు ధైర్యం గా పోస్ట్ లు కూడా వేశారు. ఇక చివరికి గంగ బయటకు వచ్చేస్తుంది అన్న వార్తలు వచ్చినప్పుడు గంగావ్వ టీమ్ స్పందించింది.
గంగవ్వ పొఅరిస్థితి పై అప్డేట్ చేసింది. అలాగే గంగవ్వ వివేకానంద పట్టుకుని ఉన్న ఫోటోని షేర్ చేసి ధైర్యాన్ని నింపారు. ఆరోగ్య పరిస్థితి చాలా బాగుందని వారు చెప్పారు. ఆమె షో ఆసాంతం కొనసాగుతుందని ఫిక్స్ అయిపోయింది. అంతకుముందు సీజన్లో కూడా సంపూర్ణేష్ బాబు ఒకసారి ఇలాగే తన వల్ల కావట్లేదు అని ఇక్కడ హౌస్ లో తనకు పిచ్చి పట్టినట్టు అవుతుందని ఇలా జీవితంలో తనకు మునుపెన్నడూ జరగలేదని చెప్పి అర్ధాంతరంగా షో మధ్యలోనే వెళ్ళిపోయాడు.
అతని స్థానంలోకి వచ్చారు వైడ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చారు అనుకోండి అది వేరే విషయం. అయితే ఉన్నఫలంగా బిగ్ బాస్ ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ను తీసుకుని రావడంతో గంగవ్వ ఖచ్చితంగా వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఆమె మాత్రం ప్రస్తుతం బాగానే ఉంది అన్న సమాచారం వచ్చింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!