NewsOrbit
న్యూస్

నారా లోకేష్ పై సిబిఐ కేసులో భారీ ట్విస్టు !

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ని సీబీఐ ఉచ్చులో ఇరికించాలన వైసీపీ ప్రభుత్వ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు.

బాబు ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసిన లోకేష్ ఐటీ గ్రిడ్ వ్యవహారంలో భారీ ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారని, అర్హతలేని కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టారని, ఈవ్యవహారంలో వేలాది కోట్లు చేతులు మారాయని ఇప్పటికే ఏపీ  మంత్రివర్గ ఉప సంఘం తేల్చింది. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు సిబిఐ దర్యాప్తు చేపట్టాలని డీజీపీ ద్వారా సిబిఐకి ముఖ్యమంత్రి లేఖ రాయించారు. ఇవే కాకుండా అనేక అవినీతి వ్యవహారాలకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్రాన్ని, కేంద్ర దర్యాప్తు సంస్థలను రాష్ట్రం కోరింది. అయితే కేంద్రం వైపు నుంచి పెద్దగా స్పందన కనిపించకపోవడంతో, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల  సందర్భంగా వైసీపీ ఎంపీలు  ఎంపీలు ఢిల్లీలో నిరసనలకు దిగుతున్నారు.

 

బాబు ప్రభుత్వం లోని అన్ని కుంభకోణాలపై దర్యాప్తు చేయించేందుకు కేంద్రం సహకరించాలని, సీబీఐను ఈ వ్యవహారాలపై నిగ్గు తేల్చాల్సింది గా ఆదేశించాలని, పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర బిజెపి పెద్దలతో పెద్దలతో వైసిపి సక్యతగానే ఉంటూ వస్తోంది. అలాగే కేంద్రం ప్రవేశపెట్టే బిల్లు అన్నిటికీ వైసిపి మద్దతు పలుకుతోంది.కేంద్రానికి , బిజెపికి దగ్గరయ్యేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. అయితే కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాలు మారాయి. ఏపి బిజెపి చీఫ్గా పదవి భాద్యతలు స్వీకరించిన సోము వీర్రాజు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో బలపడాలని బిజెపి శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్రం పూర్తిగా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించలేక పోతోంది.ఈ నేపథ్యంలోనే కేంద్రం నారా లోకేష్ పై సిబిఐ విచారణ కి అనుమతి ఇచ్చే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందంటున్నారు.దీంతో టిడిపిలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తూండగా వైసీపీ వర్గాలు డీలా పడుతున్నాయి.అయితే ప్రధాని మోదీకి సన్నిహితంగా వ్యవహరించే వైసిపి అగ్రనేత విజయసాయి రెడ్డి ఈ విషయాలను కొలిక్కి తెస్తారని వైసిపి వర్గాలు ఆశతో ఉన్నాయి.ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ విషయాన్ని తేలిగ్గా విడిచి పెట్టరని చినబాబును ఖచ్చితంగా బోనులోకి లాగుతారని వైసీపీ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి.ఆ… ఇది జరిగినప్పుడు లే అని…టిడిపి వర్గాలు తేలిగ్గా తీసుకుంటున్నాయి !

 

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N