NewsOrbit
న్యూస్

షార్ట్ ర‌న్ వివాదం.. అంపైర్‌పై రిఫ‌రీకి కింగ్స్ పంజాబ్ టీం ఫిర్యాదు..

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య ఆదివారం జ‌రిగిన మ్యాచ్ లో చోటు చేసుకున్న అంపైర్ త‌ప్పిదం మూలంగా పంజాబ్ జ‌ట్టు ఒక మ్యాచ్‌ను న‌ష్ట‌పోయిన సంగ‌తి తెలిసిందే. అయితే స‌ద‌రు అంపైర్‌పై పంజాబ్ టీం మ్యాచ్ రిఫ‌రీకి ఫిర్యాదు చేసింది. దీంతో రిఫ‌రీ జ‌వ‌గ‌ల్ శ్రీ‌నాథ్ ఈ అంశంపై త‌దుపరి వివ‌రాల‌ను పరిశీలించ‌నున్నారు.

kings xi punjab team complained to referee over short run incident

ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇన్నింగ్స్ 19వ ఓవ‌ర్‌లో ర‌బాడా విసిరిన 3వ బంతికి పంజాబ్ ప్లేయ‌ర్లు మ‌యాంక్ అగ‌ర్వాల్, క్రిస్ జోర్డాన్‌లు 2 ప‌రుగులు తీశారు. కానీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీన‌న్ మాత్రం 1 ప‌రుగును మాత్ర‌మే ఇచ్చాడు. క్రిస్ జోర్డాన్ ఒక ప‌రుగు తీసే క్ర‌మంలో బ్యాట్‌ను క్రీజులో ఉంచ‌లేద‌ని భావించిన అంపైర్ వారు 2 ప‌రుగులు తీసిన‌ప్ప‌టికీ 1 ప‌రుగును మాత్ర‌మే ఇచ్చాడు. కానీ రీప్లేలో జోర్డాన్ త‌న బ్యాట్‌ను క్రీజులో ఉంచిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపించింది. అయిన‌ప్ప‌టికీ వారికి 1 ప‌రుగు మాత్ర‌మే ద‌క్కింది. అయితే మ్యాచ్ మాత్రం ఆ ఒక్క ప‌రుగు వ‌ల్లే టైగా ముగిసింది. దీంతో సూప‌ర్ ఓవ‌ర్‌లో ఢిల్లీ గెలుపొందింది. అదే ఆ 1 ప‌రుగు ల‌భించి ఉంటే మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లేది కాదు. పంజాబ్ జ‌ట్టే గెలిచి ఉండేది. కానీ అంపైర్ త‌ప్పిదం వ‌ల్ల పంజాబ్ ఒక మ్యాచ్‌ను న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. దీంతో ఆ జ‌ట్టు ఓన‌ర్ ప్రీతి జింటాతోపాటు మాజీ క్రికెట్ ప్లేయ‌ర్లు, విశ్లేష‌కులు అంపైర్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. అయితే ఇదే విష‌యంపై పంజాబ్ సోమ‌వారం మ్యాచ్ రిఫ‌రీ జ‌వ‌గ‌ళ్ శ్రీ‌నాథ్‌కు ఫిర్యాదు చేసింది.

అయిన‌ప్ప‌టికీ ఈ విష‌యంలో రిఫ‌రీ కూడా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేడు. మ్యాచ్ ఫ‌లితాన్ని మార్చ‌లేడు. అస‌లు ఈ విష‌యంపై ఐపీఎల్ రూల్ బుక్‌లో ఎలాంటి నియ‌మాలు లేవు. అందువ‌ల్ల పంజాబ్ రిఫ‌రీకి ఫిర్యాదు చేసినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని నిపుణులు అంటున్నారు. అయితే పంజాబ్ మాత్రం సంప్ర‌దాయం ప్ర‌కారం రిఫ‌రీకి ఫిర్యాదు చేసింది. వారికే కాదు, ఏ జ‌ట్టుకైనా స‌రే ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు రిఫ‌రీకి ఫిర్యాదు చేసే అధికారం ఉంటుంది. కానీ.. మ్యాచ్ ఫ‌లితాన్ని మాత్రం రిఫ‌రీలు మార్చ‌లేరు. క‌నుక పంజాబ్ అన‌వ‌స‌రంగా ఒక మ్యాచ్‌ను న‌ష్ట‌పోయింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju