NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

కేసీఆర్ కి షాక్..! హ్యాండిచ్చిన జగన్..? సర్వం మోడీ మయం..!!

కేసీఆర్ సాధారణంగా ఎవరికీ దొరికే రకం కాదు. మహా ముదురు. అంతకు మించిన మాటకారి. కానీ జగన్ విషయంలో దొరికిపోయాడా..?
జగన్ సాధారణంగా ఎవరికీ లొంగే రకం కాదు. మహా ధైర్యశాలి. అంతకు మించిన మొండివాడు. కానీ మోడీకి లొంగిపోయాడా..?
జగన్ – కేసీఆర్ కాపురం పచ్చగా సాగుతున్న సమయంలో మధ్యలో మోడీ వచ్చి నిప్పులు పోయడం..! పాపం కేసీఆర్.., జగన్ ని నమ్మి జాతీయస్థాయికి తనను తానూ ఊచించుకోవడం., ఇలా ట్రయాంగిల్ రాజకీయ సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ట్రయాంగిల్ సిత్రంలో విలన్ మాత్రం చంద్రబాబే. ఈ ముగ్గురినీ ఒకటి చేసింది మాత్రం చంద్రబాబే..!!

మోడీ బిల్లులకు జగన్ మద్దతు ఇస్తున్నారు. గత వారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు వైసీపీ ఎంపీలు మద్దతుగా నిలిచారు. మొన్నటికి మొన్న రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు పలికింది. అక్కడైతే ఆగకుండా బిల్లులను, మోడీని పొగిడింది..! తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెడితే వైసీపీ దూరంగా ఉంది. ఇక్కడ కేసీఆర్ ప్రస్తావన కూడా చెప్పుకోవాలి. మోడీ బిల్లులకు కేసీఆర్ వ్యతిరేకమయ్యారు. గత వారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఓటింగ్ కి గైరుహాజరయ్యారు. మొన్న జరిగిన వ్యవసాయ బిల్లులో వ్యతిరేకంగా ఓటేశారు. తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. అంటే పక్కాగా… నూటికి నూరు పాళ్ళు జగన్ కి కేసీఆర్ బద్ధ వ్యతిరేకంగా వెళ్తున్నట్టే కదా..! జాతీయ స్థాయిలో ఎవరి ఆలోచనలు, ఎవరి అవసరాలు వారికి ఉన్నట్టే కదా..!!

కేసీఆర్ కి జగన్ తో పనేముంది..??

ఇక్కడ ఒక కీలక అంశాన్ని చెప్పుకోవాలి. కేసీఆర్ కి, జగన్ కి ఉమ్మడి శత్రువు చంద్రబాబు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ తో సవాలు చేసి, కేసీఆర్ ని కెలికిన చంద్రబాబు… కేసీఆర్ కి బద్ధ శత్రువుగా మారారు. అందుకే గత ఎన్నికల్లో జగన్ ని గెలిపించేలా కేసీఆర్ సహకారం అందించారు. జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. స్టాలిన్ ని కూడా తీసుకువచ్చారు. అప్పుడు వేదిక చుసిన వారికి, సీఎం జగన్ తో పాటూ మూడు రాష్ట్రాల ముఖ్య నాయకుల కలయికతో జాతీయ కూటమి కనిపించింది. కేసీఆర్ లక్ష్యం కూడా అదే. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి బీజేపీ, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా జాతీయ కూటమి కట్టాలి అనేది ఆయన కల..! అందుకే కేసీఆర్ కి జగన్ తో పని ఉంది. కానీ జగన్ మాత్రం కేసీఆర్ కి దాదాపు చేయిచ్చేసినట్టే..!!

jagan comments on kcr above pothyreddypadu
jagan comments on kcr above

జగన్ అవసరాలు ఇలా మార్చేశాయి..!!

జగన్ స్వతహాగా అటు కేసీఆర్ కి గానీ, ఇటు మోడీకి గానీ లొంగే రకం కాదు. తన పంథా వేరు, తన ఉద్దేశాలు వేరు, తన ఆలోచనలు వేరు. కానీ జగన్ పై కేసులున్నాయి. బెయిలుపై ఉన్నారు. కేంద్రం తలచుకుంటే ఎప్పుడైనా జగన్ కేసులను తోడగలదు. జగన్ ని లోపల వేసెయ్యగలదు. అందుకే తప్పని సరి పరిస్థితుల్లో బీజేపీతో చెలిమితో ఉన్నారు. వారు చెప్పిన అన్నిటికీ తల ఊపుతున్నారు. దీనికి కృతజ్ఞతగా బీజేపీ జగన్ కి ఎక్కడా ఇబ్బందులు పెట్టడం లేదు. ఏపీలో జగన్ నిర్ణయాలకు ఇరుకున పెట్టడం లేదు. పైగా పాలనలో ఎంతో కొంత సహకారం అందిస్తుంది. ఇలా బీజేపీ – వైసీపీ చెలిమి చక్కగా సాగిపోతుంది. పాపం కేసీఆర్ జగన్ తనతో కలిసి నడుస్తారని… జగన్ తో కలిసి జాతీయ కూటమి కట్టేద్దామని… కలలు కన్న కేసీఆర్ ఇప్పుడు చేసేదేం లేదు. కేసీఆర్ కి జగన్ కి మధ్యలో మోడీ గోడ కట్టేశారు.

 

 

 

 

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?