NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

సీబీఐని నమ్మడం లేదా..? వివేకా హత్య కేసులో ఏం జరుగుతుంది..!?

ఉదయం నుండీ ఓ వార్త అనేక మాధ్యమాల్లో గుప్పుమంటుంది..!! సీబీఐ దర్యాప్తుపై వివేకా కుటుంబ సభ్యులకు అనుమానాలు ఉన్నాయట. అందుకే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాని కలవడానికి అపాయింట్మెంట్ అడిగారట..! ఏమో దీనిలో నిజాలు పక్కన పెడితే దర్యాప్తు మాత్రం కొత్త పుంతలు తొక్కుతుంది. సిట్ విచారణకు భిన్నంగా, కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి.

అనూహ్యంగా కొత్త పేర్లు తెరపైకి..!!

మున్నా.. అతని ముగ్గురు భార్యలు.. అతని కాల్ లిస్టు… ఆ ఆధారంగా మరో పది పేర్లు ఈ పేర్లుకీ, వివేకా కేసుకి సంబంధం ఏమిటో..!! అదే ఇప్పుడు సీబీఐ అధికారులు రాబడుతున్నారు.
* పులివెందుల బస్టాండ్ సమీపంలోని చెప్పుల షాపు యజమాని మున్నాను అధికారులు విచారించారు. అతనికి సంబంధించిన బ్యాంకు లాకరులో రూ.48లక్షల నదు, 25 తులాల బంగారం నగలను గుర్తించి జప్తు చేశారు. ఈ మున్నాకి ముగ్గురు భార్యలు. వారినీ విచారించారు. వీరికి సంబంధించిన ఓ కుటుంబ గొడవని వివేకా పరిష్కరించారట, పంచాయితీ చేశారట..!


* రియల్ ఎస్టేట్ వ్యాపారి పుల్లయ్య, నిజాంబీ, ప్రసాద్, ట్యాంకర్ బాషా, హజ్రత్, హిజ్రా చంటి మరో ఇద్దరు వ్యక్తులను అధికారులు ప్రశ్నించి వారి నుండి స్టేట్ మెంట్‌లు రికార్డు చేశారు. వీరిని రెండు రోజుల పాటూ విచారించారు.
* మున్నా కాల్ లిస్టులో ఈ పేర్లు ఉండడంతో పిలిపించారు. వివేకా హత్యకు నాలుగు రోజుల ముందు మున్నా ఫోన్ చేయడంతో కాల్ డేటా ఆధారంగా ఫోన్ నెంబర్ గుర్తించి సీబీఐ అధికారులు అతనిని అతని సంబందీకులను విచారించారు. వివేకా ఇంట్లో పని చేస్తున్న రాజశేఖర్… ఈ హత్యకు ముందు రోజు కాణిపాకం వెళ్లడంతో… ఇది ఎందుకు అని ఆరాతీసే క్రమంలో సీబీఐ అధికారులు అతన్ని వెంట పెట్టుకుని కాణిపాకం కూడా వెళ్లారు.


* ఇప్పటి వరకు సీబీఐ 300 మందికి పైగా విచారించింది. కడప, పులివెందుల, అనంతపురం, చిత్తూరు, కాణిపాకం వంటి ప్రాంతాలకు వెళ్లి కొందరితో మాట్లాడారు. కానీ ఇవన్నీ కొత్త పేర్లు. అంతకు ముందు విచారణ జరిపిన సిట్ సుమారుగా 1300 మందిని విచారించింది. కానీ ఈ దర్యాప్తు వేరు, ఆ దర్యాప్తు కోణం వేరు.

ఎక్కడో తేడా కొడుతోంది..!!

ఇది మొత్తం చూస్తున్న వివేకా కుమార్తె సునీత రెడ్డికి, ఆ కుటుంబ సభ్యులకు దర్యాప్తు పక్కదారి పడుతుందని అనుమానాలు కలుగుతున్నాయట. రాజకీయ నాయకులు… మాజీలు, తాజాలు, ప్రముఖులను పెద్దగా పెట్టుకోకుండా ఈ చిన్న, చితక వాళ్లకు సీబీఐ ఎక్కువగా దృష్టి పెడుతుంది ఏమిటీ ..? అనేది ఆ కుటుంబ సభ్యులకు తోయడం లేదు. అందుకే ఇక లాభం లేదు. ఓ సారి కేంద్ర హోమ్ మంత్రిని కలిసి తమ ఆవేదన తెలియజేయాలి అనుకుంటున్నారట. కొత్త పేర్లు, సంబంధం లేని పేర్లు ద్వారా ఈ కేసుని ఎటు తీసుకెళ్తున్నారా అర్ధం కాక.. తమ లోపలి అంతరంగాన్ని ఆయన వద్ద చెప్పుకోవాలనేది ఈ కుటుంబ సభ్యుల యోచన కావచ్చు.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N