NewsOrbit
న్యూస్

కెసిఆర్ సాహసి… మరి చంద్రబాబు? ఇదండీ వారి మధ్య తేడా !!

Chandrababu KCR: Double Game in Telugu Politics

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి, టిఆర్ఎస్ బాస్ కెసిఆర్ కు ఉన్న ఒక తేడా ఇప్పుడు స్పష్టమైంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ లో ఓటమి చవి చూశారు.

KCR adventurer ... and Chandrababu This is the difference between them
KCR adventurer … and Chandrababu This is the difference between them

అంతముందు ఎన్నికల్లో ఆమె నిజామాబాద్లోనే ఎంపిగా మంచి మెజార్టీతో గెలుపొందారు.అయితే రకరకాల సమీకరణాలు, పసుపు రైతుల ఆందోళనలు తదితర కారణాలతో మొన్నటి ఎన్నికల్లో కవిత ఓడిపోయారు.ఈ నేపథ్యంలో ఆమె తండ్రి కేసీఆర్ అనుకుంటే కవితను నామినేటెడ్ కోటాలోనే ఎమ్మెల్సీ చేసేవారు.కానీ ఆయన ఇందుకు భిన్నంగా నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితను అభ్యర్థిగా నిలబెట్టారు.ఎన్ని ఓట్లు అన్నది ముఖ్యం కాదు… అసలు ఓట్లు ఉన్న ఎన్నికల్లో పోటీ చేయడమే ప్రధానమని కెసిఆర్ చెప్పకనే చెబుతున్నారు .

అంతేకాదు కెసిఆర్ కుమారుడు కెటిఆర్ కూడా వరుసబెట్టి ఎన్నికల్లో గెలిచి వచ్చి మంత్రి పదవి అందుకుంటున్నాడు మరి మన చంద్రబాబు నాయుడు ఏం చేశారు? తన ఏకైక కుమారుడు లోకేష్ బాబును మంత్రిగా చేయటం కోసం దొడ్డిదారిన ఎమ్మెల్యేల ఓట్లతో ఎమ్మెల్సీని చేశారు. ప్రజా క్షేత్రంలో నుంచి లోకేష్ బాబును శాసనసభ్యుడిగా చేయటం పక్కనబెట్టి చంద్రబాబు అడ్డదారిన కుమారుడిని ఎమ్మెల్సీ చేయుట ఇక గమనార్హం.సరే… ఎట్టికేలకు మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి నుండి లోకేష్ బాబును అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు అయిష్టంగా అభ్యర్థిగా నిలబడితే ఆయన దారుణంగా ఓడిపోవటం వేరే విషయం.

తన కుమారుడి విషయంలో ఎమ్మెల్సీతో ఆయనను మంత్రిని చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలైన నందమూరి సుహాసినిని మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూకట్పల్లి నుండి నిలబెట్టి బలిపశువును చేశారు.నందమూరి హరికృష్ణ కుమార్తెయైన నందమూరి సుహాసిని చంద్రబాబు ఆటలో సమిధగా మిగిలిపోయారు. ఈ నెల 9వ తేదీన జరగనున్న నిజామాబాద్ శాసనమండలి ఎన్నికల్లో కవిత గెలుపు ఏకపక్షమే.అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కుమార్తెను కూడా ఎన్నికల బరిలో నిలిపి గెలిచి రమ్మంటున్న కెసిఆర్ ని అభినందించక తప్పదు.ఏదేమైనప్పటికీ కెసిఆర్ సాహసి అని చెప్పవచ్చు.మరి చంద్రబాబును ఏమనాలో మీరే చెప్పండి!

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?