ప్రతి పండగకు గుర్తుండి పోయే ఏదో ఒక వస్తువును కొనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా బైక్ ల ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో తమకిష్టమైన బైక్ లను అది కూడా ఆఫర్లలో కొనాలనుకునే వారు చాలా మందే ఉన్నారు.
మరి అలాంటి వారి కోసమే ఓ షూరూం దీపావళీ కానుకగా బైక్ లను ఆఫర్ కింద అందించడానికి సిద్ధమవుతోంది. మీ కోసమే ఈ ఆఫర్ కావచ్చు.. మరింకెందుకు ఆలస్యం ఈ ఆర్టికల్ ను చదివి ఈ బైక్ ను మీ సొంతం చేసుకోండి. మంచి మైలేజ్, తక్కువలోనే ఈఎంఐ తో అదిరిపోయే ఆఫర్ తో మీ ముందుకు రాబోతోంది టీవీఎస్ స్పోర్ట్ బైక్. దేశంలోనే బెస్ట్ మైలేజ్ గా పేరుతెచ్చుకున్న ఈ టూవీలర్ దీపావళీ కానుకగా అందరినీ చేరబోతోంది.
దీపావళీ పండగా అదిరి పోయే ఆఫర్ గా ఆ కంపెనీ, తక్కువ ఈఎంఐ, ఆన్ రోడ్ ధరకు సమానమైన రుణం సదుపాయాన్ని కూడా ఈ బైక్ విషయంలో కల్పిస్తోంది. ఈ టూవీలర్ ను రూ.11,111 డౌన్ పేమెంట్ తో మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈఎంఐ కూడా రూ. 1,555 లతో నెలవారిగా చెల్లించే అవకాశం ఉంది.
ఈ టీవీఎస్ స్పోర్ట్ బైక్ ను కొనుగోలు చేయాలంటే మీ దగ్గర్లో ఉన్న టీవీఎస్ షోరూంకి వెళ్లి ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ బైక్ గురించి చెప్పుకోవాలంటే దీని ధర కిక్ స్టార్ట్ వెర్షన్ కు అయితే రూ.54,850 గా ఉంది. అలాగే సెల్ఫ్ వెహికిల్ కు అయితే ధర 61,525 రూపాయలుగా ఉంది. అయితే దీనికి ఆన్ రోడ్ ధర ఎక్కువగా ఉంటుంది. దీనికి 110 సీసీ ఇంజన్ కూడా ఉంటుంది.