NewsOrbit
రాజ‌కీయాలు

‘దివిసీమ ఉప్పెన’.. ఆ కాళరాత్రికి 43 ఏళ్లు..!

43 years for diviseema uppena storm

సముద్రాల్లో ఏర్పడే ఉపరితల ఆవర్తనం వాయుగుండం, తుఫాను, తీవ్ర తుఫానుగా మారతాయి. తీరాల్ని తాకి అల్లకల్లోలం సృష్టిస్తాయి. భారీ ఆస్తి, ప్రాణ నష్టం కలుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చి ముందస్తు హెచ్చరికలు వస్తున్నాయి. కానీ.. ఇవేమీ లేనప్పుడు ఒక మహా ఉత్పాతం.. ప్రళయమై వచ్చింది. ఊళ్లకు ఊళ్లనే తుడిచి పెట్టేసింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంతో ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయిన ఆ విధ్వంసమే.. ‘దివిసీమ ఉప్పెన’. 1977 నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో నాగాయలంక, కోడూరు ప్రాంతంలో తీరం దాటిన ఆ రాకాసి తుఫాను చేసిన భీభత్సం ఇప్పటికీ ఆ ప్రాంతవాసులను కలవరపెడుతూనే ఉంది. నేటితో ఆ మహా ప్రళయానికి 43 ఏళ్లు పూర్తయ్యాయి.

43 years for diviseema uppena storm
43 years for diviseema uppena storm

ఆరోజు కాళరాత్రే అయింది..

నవంబర్ నెల, టెక్నాలజీ లేని రోజులు కావడంతో ఎటువంటి తుఫాను సంకేతాలు లేవు. కానీ.. 1977 నవంబర్ 18న సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాయంత్రానికి వాతావరణం చల్లగా మారిపోయింది. మేఘాలు నల్లగా తీరం దాటి ఊళ్లలో పైకప్పులా పది మీటర్ల ఎత్తులో పరుచుకుంది. భారీ వర్షం పడుతుందని భావించారే కానీ.. ఆ రాత్రి ఓ ప్రళయ రాత్రి కాబోతోందని దివి ప్రజలు ఊహించలేదు. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో.. ఒక్కసారిగా తీరం దాటిన ప్రళయ తుఫాను గ్రామాలపై పెను విధ్వంసం సృష్టించింది. ఏం జరుగుతుందో ఊహించేలోపే రాకాసి అలలు ఊళ్లను ముంచేసాయి. హోరు గాలికి, రాకాసి అలలకు ప్రజలు బలైపోయారు.

చెట్టుకొకరు.. పుట్టకొకరు..

అధికారిక అంచనానే 10వేలకు పైగా మృతులు. ఇల్లూ, పిల్లా, కుటుంబాలు, పశువులు.. నామరూపాలు లేకుండా పోయాయి. గుట్టలుగా తేలిన శవాలు.. తమ వారెవరో గుర్తుపట్టలేని బంధువులు.. కళేబరాలై తేలిన పశువులు, స్మశానాలుగా మారిన ఊళ్లు, వేళ్లతో సహా పెకిలించబడ్డ చెట్లు.. ఇలా దివిసీమ పెను ప్రళయానికి సాక్ష్యాలుగా నిలిచాయి. పాచిపోయి, కుళ్లిపోయిన మృతదేహాలకు సామూహిక దహన సంస్కారాలు జరిగాయి. ప్రధాని ఇందిరాగాంధీ వచ్చి ప్రభుత్వపరంగా ఆదుకున్నారు. మదర్ థెరిసా కూడా వచ్చి సహాయం చేశారు. మిషనరీలు, గాంధీ పీస్ ఫౌండేషన్, ఆర్ఎస్సెస్ వంటి సంస్థలు ప్రజలకు సాయం అందించాయి. ఎంత సాయం అందించినా కోలుకోలేని విలయం అది. అందుకే ఇప్పటికీ ‘దివిసీమ ఉప్పెన’ అనే పదం.. అక్కడి వారిని ఉలిక్కిపడేలా చేస్తోంది.

 

 

 

 

Related posts

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?