NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

గ్రేటర్ లో సీక్రెట్ మిషన్ అమలు చేస్తున్న పార్టీ..! బీజేపీ ముఖచిత్రం ఇదీ..!!

గెలుపు ఇచ్చే కిక్కు భలే ఉంటుంది..! ఓటమి నేర్పే పాఠం అంతకంటే బాగుంటుంది..!!
ఆ కిక్కులో పట్టుతప్పితే బొక్కబోర్లాపడడం ఖాయం..! ఈ పాఠం గ్రహించకున్నా మరిన్ని ఓటములు ఖాయం..!! మరి అటు బీజేపీ గెలుపు కిక్కుతో, ఇటు టీఆరెస్ ఓటమి పాఠంతో గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. వీటిలో ఎవరి పరిస్థితి ఏమిటో తెలుసుకునే ముందు.., బీజేపీ ముఖచిత్రం ఓ సారి పరిశీలిద్దాం..!!

బీజేపీ లెక్కల్లో లేని పార్టీ. ఏదో నాలుగైదు స్థానాలు గెలుచుకుంటుంది. టీఆరెస్ కి అసలు ప్రత్యర్థి కాంగ్రెస్, అంతో కొంత టీడీపీ మాత్రమే..! ఇదీ గత ఎన్నికల వరకు ఉన్న వాదన. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కమలం కాషాయం రంగులో వికసిస్తుంది. విస్తరిస్తుంది. తెలంగాణాలో టీఆరెస్ కి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న బీజేపీ ఇప్పుడు ఆ దశ వరకు వచ్చేసింది. కాంగ్రెస్ ని తోసేసి, టీడీపీని తొక్కేసి బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. మొన్నటి దుబ్బాక గెలుపుతో ఇక తెలంగాణాలో బీజేపీకే భవిష్యత్తు అనేంతగా ప్రచారం మొదలయింది. ఆ దుబ్బాక కిక్కు ఇప్పుడు బీజేపీకి గ్రేటర్ లో మంత్రంగా పని చేస్తుంది. ఆ పార్టీ వ్యూహాలు కూడా గమ్మత్తుగా, చాకచక్యంగా ఉంటున్నాయి. టీఆరెస్ కి వ్యతిరేక పక్షాలను ఏకం చేసి.. బీజేపీలో కలుపుకోవడం లక్ష్యంగా పావులు కదుపుతుంది.

bjp big shock to trs in dubbaka
bjp big shock to trs in dubbaka

ముందుండి… దూకుడుగా “బండి”..!!

గ్రేటర్ లో బీజేపీకి చాలా పెద్ద తలకాయలున్నాయ్. మొదటి నుండి కిషన్ రెడ్డి ఇక్కడ పార్టీని భుజాన, నెత్తిన మోశారు. ఆయనకు ఇప్పటికీ నాలుగు నియోజకవర్గాల్లో పట్టు ఉంది. ఆ తర్వాత బంగారు లక్ష్మణ్, దత్తాత్రేయలకు పట్టుంది. కానీ ఈ అందరిని కాదని.., ఈ అందరితో పాటూ.., ఈ అందరికీ భిన్నంగా బండి సంజయ్ రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ ఒకటి అంటే ఈయన రెండు అంటున్నారు. కేటీఆర్ రెండు అంటే.., ఈయన నాలుగు అంటున్నారు. అధికార పార్టీకి ఎక్కడా తలొగ్గడం లేదు, ఎక్కడా తగ్గడం లేదు. దూకుడు మంత్రం జపిస్తూ అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారు. ఈయన లాగానే, ఆయనకు తోడుగా ఎంపీ అరవింద్ కూడా దూకుడుగా టీఆరెస్ కి ధీటుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఇలా ఉంటె మరి బంగారు లక్ష్మణ్, కిషన్ రెడ్డిలు ఏం చేయాలో.., ఎలా చేయాలో..? అదే చేస్తున్నారు.

రహస్య భేటీలు.. ఆహ్వానాలు..!!

కిషన్ రెడ్డి కీలక నేత. లక్ష్మణ్ చాణక్యత ఉన్న నేత. ఈ ఇద్దరూ కలిసి రహస్య రాజకీయం గమ్మత్తుగా చేస్తున్నారు. గ్రేటర్ ని అయిదు భాగాలుగా విభజించి.. (మల్కాజ్ గిరి, ఎల్బీ నగర్, పఠాన్ చెరు, పాత నగరం, సికింద్రాబాద్) ఒక్కోచోట ఒక్కో బలమైన నాయకుడిని పార్టీలోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆరెస్ లో ఉంటూ చక్రం తిప్పి, ప్రస్తుతం రాజకీయంగా అంతగా చురుగ్గా లేని నేతలను కలుస్తూ బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇది ఎంతో కొంత కలిసి వస్తుందని భావిస్తున్నారు. మల్కాజ్ గిరి ప్రాంతంలో పట్టున్న సర్వే సత్యన్నారాయణ.., దేవేందేర్ గౌడ్ కుమారుడు, సికింద్రాబాద్ లో పట్టున్న అంజన్ కుమార్ యాదవ్ ఇలా వెటరన్ నాయకులను బీజేపీలోకి పిలిచి, ప్రచారానికి వాడుకునే వ్యూహాల్లో ఉన్నారు. పనిలో పనిగా జనసేన, పవన్ అభిమానులను ఎలా వాడుకోవాలో అలాగే వాడుకునే ప్లాన్ లో ఉంది. కేసీఆర్ కి, టీఆరెస్ కి వ్యతిరేక శక్తులను ఏకం చేయాలనేది వీరి ప్లాన్.

Bjp game started in telangana

టార్గెట్ 60 .., కనీసం 35 ..!!

బీజేపీ ప్రస్తుత లక్ష్యం 60 స్థానాలు గెలుచుకోవాలని. గత ఎన్నికల్లో వారు గెలిచింది కేవలం 4 స్థానాలు మాత్రమే. కానీ అప్పటి బీజేపీ వేరు, ఇప్పటి బీజేపీ వేరు. నాడు దుబ్బాక గెలుపు లేదు, నాడు కిషన్ రెడ్డి కేంద్ర సహాయ హోమ్ మంత్రి కాదు, నాడు బండి సంజయ్, అరవింద్ లాంటి దూకుడు లేదు, నాడు పైన అమిత్ షా, మోడీ లాంటి దిగ్గజాల అండ లేదు. సో… అప్పటి బీజేపీకి, ఇప్పటి బీజేపీకి చాలా తేడా ఉంది. అందుకే గ్రేటర్ పరిధిలో 60 స్థానాల్లో గెలవాలని బీజేపీ లక్ష్యం.., కానీ 30 నుండి 35 గెలవడం సులువు అని విశ్లేషణలు చెప్తున్నాయి. కానీ 50 స్థానాల్లో టీఆరెస్ కి గట్టి చుక్కలు చూపించనుంది. టీఆరెస్ వ్యతిరేక ఓట్లు చీలిక లేకుండా టీడీపీ, కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపకుండా చేయాలి అనేది బీజేపీ సీక్రెట్ మిషన్.
(ఇక గ్రేటర్ లో కాంగ్రెస్ పరిస్థితి.., టీడీపీ దీన స్థితి.., టీఆరెస్ గెలుపు వ్యూహాలు, మజ్లీస్ పట్టు.. ఇలా పార్టీల వారీగా విశ్లేషణలు, ప్రతీ రోజు “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా అందిస్తుంది)

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju