NewsOrbit
Featured న్యూస్

రేప్ కేసు పెట్టిన అమ్మాయికి కోర్టు జరిమానా : తమిళనాడు లో సంచలనం!

 

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)

ఓ యువకుడిపై రేప్ కేసు పెట్టిన అమ్మాయికి 15 లక్షలు చెల్లించాలని తమిళనాడు కోర్టు తీర్పు ఇవ్వడం సంచలనంగా మారుతోంది అదేంటో చదివేయండి… రేప్ కేసు పెట్టిన తరువాత కొన్నేళ్లు సదరు యువకుడు విచారణ ఎదుర్కొన్నాడు. అనంతరం ఆ అమ్మాయికి పుట్టిన శిశువుకి తండ్రి రేప్ కేసు లో నిందితుడు కాదని డీ ఎన్ ఏ రిపోర్ట్ వచ్చింది. దింతో యువకుడు ని కోర్టు విడుదల చేసింది. నిర్దోషిగా విడుదల చేసింది. దీని తరువాత యువకుడు లీగల్ గా ప్రొసీడ్ అయ్యాడు. తన పరువుకు, కుటుంబ పరువుకు కావాలని నష్టం చేసారని, పరిహారం చెల్లించాలని యువకుడు కేసు వేయగా, కేసులో తీర్పు అతడికి అనుకూలంగా కోర్టు ఇచ్చింది.

rape case

ఎం జరిగింది అంటే??

తమిళనాడు చెన్నై ప్రాంతంలో
ఓ అమ్మాయి, అబ్బాయికి పెళ్లి కుదిరింది. అయితే, ఇరు కుటంబాల మధ్య విభేదాలు రావడంతో ఆ అమ్మాయిని తమ అబ్బాయి పెళ్లి చేసుకోడని ఆ యువకుడి కుటుంబం వారు చెప్పారు. దీంతో ఆ అబ్బాయిపై అమ్మాయి కేసు పెట్టింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, తాను తల్లినయ్యానని చెప్పింది. దీంతో పోలీస్ లు రేప్, చీటింగ్ కేసు నమోదు చేశారు. యువకుడు కొన్నేళ్లుగా విచారణ ఎదుర్కొన్నాడు. అయితే, దీనిపై పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం అమ్మాయికి పుట్టిన శిశువు డీ ఎన్ ఏ రిపోర్ట్ లు పరిశీలించింది. దీనిలో శిశువు తండ్రి ఆ యువకుడు కాదని తేల్చింది. తమిళనాడుకు చెందిన సంతోష్ అనే యువకుడి కుటుంబం, ఆ అమ్మాయి కుటుంబాల ఇళ్లు పక్కపక్కనే ఉండేవి.
వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో సంతోష్‌తో ఆ యువతి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబాల మధ్య ఆస్తి వివాదాల తలెత్తాయి. సంతోష్ కుటుంబం వేరే చోటుకి వెళ్లిపోయి అక్కడే నివసిస్తోంది. ఆ యువతి గర్బం దాల్చడంతో ఆమె కడుపులో పుట్టబోయే బిడ్డకు సంతోష్ కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అయితే, తనకేమీ తెలియదని, ఆమెతో తాను ఎన్నడూ సన్నిహితంగా లేనని సంతోష్ చెప్పిన ఫలితం లేకపోయింది. అయినప్పటికీ యువతి తల్లిదండ్రులు అతడిపై అత్యాచారం కేసు పెట్టారు. దీంతో 2009 నవంబరులో అరెస్టయిన సంతోష్ 95 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో విచారణ ఎదుర్కొన్నాడు. 2010 ఫిబ్రవరి 12న బెయిల్‌పై విడుదలయ్యాడు.

 

law

డీఎన్ఏ చెప్పేసింది

అతడిపై కేసు పెట్టిన యువతి ఓ పాపకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పాపకు డీఎన్‌ఏ పరీక్షలు చేయగా, ఆమె తండ్రి సంతోష్ కాదని తేలింది. 2016, ఫిబ్రవరి 10న న్యాయస్థానం అతడిని నిర్దోషిగా తేల్చి తీర్పు చెప్పింది.

నేను నష్టపోయాను!!

కేసులో తీర్పు వచ్చిన తరువాత ఆ యువకుడు వేదన చెందాడు. తనపై అన్యాయంగా కేసు పెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని సదరు యువతిపై ఆ యువకుడు పరువు నష్టం దావా వేశారు. యువతీ కుటుంబం కావాలనే తన ను ఇబ్బంది పెట్టిందని, దీని వల్ల సమాజంలో పరువు పోయిందని రూ.30 లక్షల పరిహారం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. దీనిపై కూడా సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఆ మహిళ కుటుంబాన్ని ఆదేశించింది.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju