NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పేడ‌తో కొట్టుకునే వింత ఆచారం.. ఎక్క‌డో తెలుసా?

మీరు ప‌శువుల పేడ‌తో ఏం చేస్తారు..? క‌ల్లాపి చ‌ల్లుతారు, గొబ్బెమ్మ‌లు పెడ‌తారు, ఇళ్లు అలుకుతారు.. అంతే క‌దా..? కానీ ఆ ఊర్లో పేడ‌తో కొట్టుకుంటారు. ఒక‌రు ఇద్ద‌రు కాదు ఊరు ఊరంతా పేడ‌తో కొట్టుకుంటారు. ఊరంతా పేడ వాస‌న‌తో నిండినా డోంట్ కేర్ అంటూ ఏంతో ఉత్స‌హంగా పేడ‌తో కొట్టుకుంటూ వేడుక చేసుకుంటారు.

ఆ ఊర్లో ఉన్న వారంతా ఒక చోటుకు తీసుకు వ‌స్తారు. పెక్క‌డెక్క‌డో ఉన్న పేడ‌ను ఊరి వీధుల్లో పోస్తారు. ఇక ర‌చ్చ చేసేందుకు అంతా సిద్ధ‌మ‌వుతారు. ఒక‌రినోక‌రు ఆ పేడ ముద్ద‌ల‌తో బాదుకుంటారు. ఎక్క‌డా ఆగ‌కుండా దొరికిన వారిని దొరికిన‌ట్టు పేడ‌తో నింపేస్తారు. ఇది కోపంతో కొట్టుకునేది కాదు. తాత‌ల కాలం నుంచి వ‌స్తున్న ఆచారం. దీన్ని ఎంతో నిష్ఠ‌తో వారు ఆచ‌రిస్తారు. ఈ వేడుక‌ను దీపావ‌ళి పండ‌గ‌ను పుర‌స్క‌రించుకుని చేస్తారు.

ఇది ఎక్క‌డో కాదు మ‌న పక్క రాష్ట్ర‌లైన క‌ర్ణాట‌క- త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దులో ఉన్న గుమ్మటపురాలో. ఇది ఇక్క‌డా ఏటా జ‌రిగే పండ‌గ‌. ఈ వేడుక సందర్భంగా చుట్టుపక్కల ఊర్లలో ఉన్న పేడంగా ఈ ఊర్లోకి తెస్తారు.ఆ పేడను ఒక‌ వీధిలో వేసి కొట్టుకోవడం షూరు చేస్తారు. ఈ వేడుకను గోరెహబ్బా అని పిలుస్తారు. పేడతో కొట్టుకోవ‌డం ఈ పండ‌గ‌లో ఆన‌వాయితి.

దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఊర్లోని వారంతా భక్తితో కొలిచే బీరేశ్వర స్వామి ఆవు పేడలోనే పుట్టారని ఇక్క‌డి వారి న‌మ్మ‌కం. అందుకే, దీపావళి సంద‌ర్భంగా వీరంగా పేడ‌తో కొట్టుకుంటారు.దీంతో ఆరోగ్యంగా ఉంటామ‌ని వారి న‌మ్మ‌కం. అయితే ఈ వేడుక‌లో పురుషులు మాత్రమే పాల్గొంటారు. షర్టులు వేసుకోకుండా ఈ పేడ వేడుక‌లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా ఒక లుక్ వేయండి

ఇలాంటి సంప్ర‌దాయ‌లు ప్ర‌పంచంలో ప‌లు చోట్ల ఉన్నాయి. కానీ ఒక్కో చోట ఒక్కోలా చేస్తారు. అందులో స్పెయిన్‌లో ఏటా టమోటా ఉత్సవం జ‌రుపుకుంటారు. ఇక ఇటలీలో ఆరెంజ్ వార్ జ‌రుగుతుంది.అయితే ఆ ప్రాంతాల్లో పండ్ల‌తో కొట్టుకుంటారు. దాంతో పెద్ద‌గా వాస‌న ఏమీ ఉండ‌దు. కానీ మ‌న ద‌గ్గ‌ర పేడ‌తో కొట్టుకుంటారు. ఎంత వాస‌న వ‌చ్చిన కానీ భ‌క్తి తో చేస్తామ‌ని అక్క‌డి వారు చెబుతున్నారు.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!