పన్నెండవ వారంలో బిగ్ బాస్ సీజన్ ఫోర్ దిగ్విజయంగా ప్రసారమవుతుంది. మొన్నటి వరకూ ఇంటిలో కిచెన్ లో అన్ని బాధ్యతలు తీసుకొని అందరికీ వంటలు వండుతూ ప్రతి ఒక్కరితో గొడవలు లేకుండా ఉన్న లాస్య ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వడం అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉండగా లాస్య ఎలిమినేట్ అవుతున్నట్లు శనివారం లీక్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా సోమవారం జరగబోయే ఎలిమినేషన్ ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా మరొక వార్త ఇప్పుడు లీక్ అయింది. అది ఏమిటంటే ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్ గా హారిక ఉందన్న సంగతి తెలిసిందే.
కాగా ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ వారం లీక్ వార్తల ప్రకారం అరియనా, అవినాష్, మోనాల్, అఖిల్, సోహెల్, అభిజిత్ నామినేషన్ లో ఉండగా.. కెప్టెన్ గా ఉన్న హారిక ఇంటి సభ్యులలో నామినేషన్ అయినా వారిలో ఒకరిని సేవ్ చేయొచ్చని బిగ్ బాస్ కోరటంతో.. బెస్ట్ ఫ్రెండ్ మరియు హౌస్ లో ఎంటరైన నాటినుండి క్లోజ్ గా ఉంటున్న అభిజిత్ ని సేవ్ చేయడం జరిగింది అనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రతి వారం నామినేషన్ లో ఉండే అభిజిత్ ఈసారి తప్పించుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.