NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఇకమీదట నో హెల్మెట్.. నో ఫ్యూయల్.. ఎక్కడో తెలుసా..!?

 

 

భద్రం బిడ్డా..! జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా..! అని అమ్మ ఆ మాట అంటుంది.. రోజు ఉద్యోగానికి, పని మీద బయటకు బైక్ మీద వెళ్తున్నారా..? హెల్మెట్ పెట్టుకుంటున్నార..! హా.. లైట్.. అంటారా.. పెట్రోల్ అయిపోయిందా..? పెట్రోల్ బంక్ కి వెళ్తున్నారా..? ఇప్పుడైనా హెల్మెట్ పెట్టుకుంటున్నార..? ఏంటి హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయ్యారా.. అంటారా ..? అవునండీ..! నిజమే ఇకమీదట హెల్మెట్ లేకపోతే పెట్రోల్ ఇవ్వకూడదని సమాచారం ..! పూర్తి వివరాలు ఇలా..

no helmet-no fuel

చాలావరకు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేని కారణంగానే ప్రాణాలు పోతున్నాయి. బైక్ ప్రమాదాల్లో 70 శాతం అనర్థాలు హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. ఒక్కోసారి హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడుతుంటే… వెనక కూర్చొని హెల్మెట్ పెట్టుకోని వ్యక్తి చనిపోతున్నాడు. అందుకే.. బైక్ పై ఇద్దరు వెళ్తే… ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అని ట్రాఫిక్ పోలీసులు తేల్చి చెప్పారు. అయితే ట్రాఫిక్ పోలీసులు అనేక కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించలేకపోతున్నారు.

‘నో హెల్మెట్ నో ఫ్యూయల్’ :
పశ్చిమ బెంగాల్‌లో ద్విచక్ర వాహన డ్రైవర్లు పెరుగుతున్న కారణంగా అక్కడ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల దృష్ట్యా కోల్‌కతా పోలీసులు డిసెంబర్ 8 నుండి నగరంలో ‘నో హెల్మెట్ నో ఫ్యూయల్’ ప్రచారాన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రచారం కింద, హెల్మెట్ ధరించని డ్రైవర్లకు పెట్రోల్ స్టేషన్ వద్ద పెట్రోల్ ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ నిబంధన 60 రోజులుగా అమలు చేయనున్నారు.

no helmet no fuel in west bengal

నగరంలో రోజు రోజుకి హెల్మెట్ ధరించని వాహనదారులు ఎక్కువవుతున్నారు. అంతే కాకుండా డ్రైవర్లు హెల్మెట్ ధరించని కేసులు ఎక్కువవుతున్నాయని కోల్‌కతా పోలీసు కమిషనర్ అనుజ్ శర్మ తెలిపారు. బైక్ డ్రైవర్లు వారి వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదంలో ఇద్దరూ గాయపడే అవకాశం ఉంది. ఇటువంటి కేసులలో అనేక ప్రాసిక్యూషన్లు ఉన్నప్పటికీ, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపడం వల్ల అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. మెరుగైన రహదారి పద్దతులను నిర్ధారించడానికి, ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించేవారిని నిరోధించడానికి, చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

పెట్రోల్ స్టేషన్ వద్ద హెల్మెట్ లేకుండా ఏ ద్విచక్ర వాహన డ్రైవర్‌కి పెట్రోల్ ఇవ్వవద్దని పోలీసులు తమ పరిధిలోకి వచ్చే అన్ని పెట్రోల్ స్టేషన్లకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారని కోల్‌కతా పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ విధంగా చేసినప్పుడైనా కొంతవరకు అయినా ఈ నియమాలను అనుసరించే అవకాశం ఉంది. అంతేకాకుండా బైక్ డ్రైవర్ వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోయినా, అతనికి పెట్రోల్ ఇవ్వకూడదని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఈ విధంగా ధరించినప్పుడే వారికీ పెట్రోల్ స్టేషన్ వద్ద పెట్రోల్ అందించబడుతుంది. ఈ విధానం బైక్ పై ప్రయాణించే ఇద్దరికీ కూడా చాల అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ప్రమాదం జరిగినప్పటికీ తలకు పెద్దగా గాయాలు కావు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?