బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ వీక్ కి ముందు అనేక గొడవలు హౌస్ లో జరుగుతున్నాయి. సోమవారం జరిగిన ఎపిసోడ్ లో హారిక, అఖిల్ మరియు సోహెల్ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. హారిక రాజు స్థానం లో కూర్చుని అభి బట్టలు స్విమ్మింగ్ పూల్ లో విసిరేయటం తో కోపం తెచ్చుకున్న సోహెల్.. హారిక పై అఖిల్ పై ఫుల్ సీరియస్ అవ్వడం జరిగింది.
ఇదిలా ఉండగా మంగళవారం జరగబోయే ఎపిసోడ్ లో ఈ సారి గట్టిగా గొడవ జరిగినట్లు లీక్ వార్తలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. అయితే ఈసారి సోహెల్ కి అరియనా కి మధ్య చాలా పెద్ద గొడవ జరిగినట్లు మధ్యలో అభి వచ్చి కాంప్రమైజ్ చేయాలని భావించిన గానీ ఇద్దరూ తగ్గలేదు అన్నట్టు లీక్ వీరులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
మొదటి నుండి వీరిద్దరి మధ్య జరిగిన గొడవ కంటే ఈసారి మాత్రం చాలా గట్టిగా జరిగిందని మంగళవారం జరగబోయే ఎపిసోడ్ కి మాత్రమే కాక ఈ సీజన్ కె హైలెట్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ గొడవ విషయంలో సోహెల్ కి బయట ఆడియన్స్ నుండి నెగిటివ్ గా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది అని పేర్కొంటున్నారు. ప్రతిసారి అమ్మాయిల తో గొడవలు పెట్టుకోవటం తో సోహెల్ చివరి దశలో తన క్రేజ్ కొద్దిగా డ్యామేజ్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో చివరి వారానికి ముందు.. ఇంటి సభ్యుల మధ్య రోజుకో గొడవ జరగటం చూస్తే.. ఈ వారం చివరిలో గట్టిగానే ఓటింగ్ జరిగే అవకాశం ఉందని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.