NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 10th గురువారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

రాశిఫలాలు- కార్తీకమాసం- దక్షిణాయనం- శరత్‌రుతువు- తిథి- దశమి ఉదయం 9.29 నిమిషాల వరకు తదుపరి ఏకాదశి. నక్షత్రం హస్తా. వర్జ్యం: మధ్యాహ్నం 3.48 నిమిషాల నుంచి 5.17 నిమిషాల వరకు. ఈరోజు ద్వాదశరాశుల గోచార ఫలాలు తెలుసుకుందాం…

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది !

ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. సమయానికి చేతికి డబ్బులు అనడం వలన, అనుకున్న పని పూర్తి చేయడం వలన చాలా ఆనందంగా ఉంటారు. ఈరోజు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈరోజు అందరికీ ఆదర్శంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతారు. పరిస్థితిని తగ్గట్టుగా ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో అనే విషయంలో  చక్కని ప్రాధాన్యతను సంపాదిస్తారు. ఈరోజు పరువు ప్రతిష్ఠలకు ప్రాధాన్యం ఇస్తారు. పెద్దవారిని గౌరవించండి. ఈరోజు చాలా శ్రమ పడతారు. ఈరోజు స్వతంత్రంగా ఆలోచించి మీకు మీరే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు చెడు అలవాట్లని తగ్గించుకోండి. అందరినీ ఉత్సాహపరిస్తారు. ఈరోజు వైవాహిక జీవితంలోని గొడవలు తొలగిపోతాయి. ఈ రోజు ఏ పని చేసిన ఆలోచించి చేస్తారు. ధన లాభం కలుగుతుంది. ఈరోజు దైవదర్శనం చేసుకుంటారు. ఈరోజు ఉద్యోగులకు, విద్యార్థులకు చాలా మంచిగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు శ్రీదుర్గా అష్టకం పారాయణం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది.

 

వృషభ రాశి : సమస్యలు పోయి సంతోషంగా గడుపుతారు !

ఈరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే పెద్ద వారి సలహాలు సూచనలు తీసుకుని పాటించండి. ఈరోజు గొడవలకు వెళ్లకుండా మౌనంగా ఉంటే మంచిది. ఈ రోజు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఈ రోజు అనుకున్న పనులు పూర్తికాక, అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందక ఇబ్బంది పడతారు. భార్యాభర్తల మధ్య పాత గొడవలు సమస్యలు పోయి సంతోషంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన ఫలితం దక్కుతుంది. ఓర్పును సహనాన్ని పెంచుకుంటారు. ప్రయాణాలో జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వుండండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు శ్రీలలితా దేవి సహస్రనామాలను పారాయణం చేసుకోండి. అంతా అనుకూలంగా ఉంటుంది.

 

మిథున రాశి : విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది !

పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యం ఇస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు.  అనుకున్నది సాధించే వరకు కష్టపడతారు. ఈరోజు కుటుంబ సభ్యుల కోసం, స్నేహితుల కోసం కష్టపడతారు. ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు భార్యభర్తలు సంతోషంగా ఉంటారు. ఈరోజు క్రమశిక్షణగా మంచిగా మారాలి  అనే తపన పెరుగుతుంది. ఈరోజు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మంచి మనసుతో అందర్నీ కలుపుకొని పోతారు. ఈరోజు మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం వల్ల ఎన్నో అదృష్టాలను పొందుతారు. ఈరోజు ఏ పని చేసినా చేసినా ఉల్లాసంగా, ఉత్సాహంగా చేస్తారు. ఉద్యోగులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ  పుట్టింటి నుంచి శుభవార్త వింటారు. ఈరోజు వ్యాపారస్తులకు ధన లాభం కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోండి అనుకూల ఫలితాలు, అంతా శుభప్రదంగా ఉంటుంది.

 

కర్కాటక రాశి : బంధుమిత్రులతో గొడవ పడే అవకాశం !

ఈరోజు రుణ బాధల బాధల వల్ల సమయానికి డబ్బులు అందక ఇబ్బంది పడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.  ఈరోజు కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో గొడవ పడే అవకాశం ఉంది జాగ్రత్త. ఈరోజు వ్యసనాలకు దూరంగా  ఉండండి. ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. వైవాహిక జీవితం ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు చెయ్యకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనవసర ఖర్చులు చేయకండి. ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు పై జాగ్రత్త.

రెమిడీ: ఈరోజు శ్రీశివకవచం పారాయణం చేసుకోండి.

 

సింహ రాశి : ఈ రోజు కొత్త ఆలోచనలు చేస్తారు !

ఈరోజు ఎక్కువగా శ్రమ పడకుండా ఉండాలని సుఖంగా గడపాలని ప్రయత్నిస్తారు. ఆర్థికంగా ఎదగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు కొత్త ఆలోచనలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు కష్టాల్లో ఉన్న వారిని వారిని ఆదుకుంటారు. ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు నీతిగా, నిజాయితీగా ఉండాలని ప్రయత్నిస్తారు. ఈరోజు మీలో ఉన్న అహంకారాన్ని, చెడు గుణాలని తొలగించుకుని మంచిగా ఉండాలని ప్రయత్నిస్తారు. అందరితో కలుపుగోలుగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు విద్యార్థులు ఏ పని ప్రారంభించినా మంచి ఫలితం దక్కుతుంది.

రెమిడీ: అమ్మవారి సహస్రనామాలను, స్తోత్ర పారాయణం చేసుకోండి. అంత మంచిగా ఉంటుంది

 

కన్యరాశి : అనవసర అప్పులు చేసే అవకాశం !

ఫలితం అనుకున్నంత రాదు. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన వస్తుంది. వీటికి దూరంగా ఉండండి. జూదాలు, షేర్‌, అప్పులు ఇవ్వడం వంటివాటికి దూరంగా ఉండండి. ఈరాశివారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రుణాల బాధలు, అనవసర అప్పులు చేసే అవకాశం. శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో చాలా వత్తిడి, శ్రమ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాల వల్ల ఇబ్బందులు. వ్యసనాలకు అలవాటు పడే అవకాశం. దీనివల్ల నష్టం. అభాసుపాలు అయ్యే అవకాశం. మంచి చెడు ఆలోచించి మాట్లాడాలి. మాట జారడం వల్ల ఇష్టమైనవారిని దూరం చేసుకునే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు. శత్రువులు పెరిగే అవకాశం. అనారోగ్య సూచన. మిత్రువులు మీ దగ్గర సొమ్ముకాజేసే అవకాశం. ఎవరికి ధనాన్ని ఇవ్వకండి. కొన్ని కొన్ని అవకాశాలు చివరిదాకా వచ్చి  చేజారిపోతాయి. చేసేపనిని బాధతో చేస్తారు. దీనివల్ల నష్టం. పెద్దవారి వల్ల ఖర్చులు. ధననష్టం. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడుతారు,. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు. విద్యార్థులకు ప్రతికూలం. టైం వేస్ట్‌ చేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. స్త్రీలకు అనవసర ఖర్చులు, ఇంట్లో కూడా అనవసర ఖర్చులు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు అంతంతమాత్రంగా వ్యాపారం.

రెమిడీః ఈరాశివారు గురుసంబంధ దేవాలయ దర్శనం, లేదా గురు చరిత్ర పారాయణం లేదా బాబా దేవాలయంలో ధునిలో కొబ్బరికాయను సమర్పించండం చేయండి.

 

తులారాశి : కొత్త ఆభరణాలు కొంటారు !

మంచి అవకాశాలు వస్తాయి. చక్కని ప్రతిభ వస్తుంది. వాస్తవాలను గ్రహించి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి టర్నింగ్‌పాయింట్‌ ఉంటుంది. అందరినీ ఆకట్టుకుంటారు. ఈరాశివారికి అనుకూలం. ఏరకంగా భవిష్యత్‌ ఉండాలి అనే విషయాలు తెలుస్తాయి. మార్పు జీవితానికి మంచి చేస్తుంది. ముఖ్య వ్యవహారాలు విజయం సాధిస్తారు. ఆస్తివ్యవహారాలు పూర్తవుతాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిలో మార్పులు వస్తాయి. వాహనాల అమ్మకాలు, ఇండ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి అనుకూలం, కొత్త ఆభరణాలు కొంటారు. పెండింగ్‌  బిల్లులు చేతికి అందుతాయి. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సోదరుల నుంచి మంచి సంబంధబాంధవ్యాలను పెంచుకుంటారు. నీతి నిజాయతీ ఉండటం వల్ల మీకు గౌరవం పెంచుతుంది. ఉద్యోగ ప్రయత్నం కలసివస్తుంది. విద్యార్థుల ప్రాజెక్ట్‌ వర్క్‌లు, అనుకూలిస్తాయి. స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. కిరాణ, బంగారం వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఈరోజు బాగా కలసివస్తుంది.

రెమిడీః శ్రీబాలాత్రిపురసుందరీ ఆరాధనచేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

వృశ్చికరాశి : బంధువులతో విరోధాలు !

ఈరాశి విద్యార్థులు ఇతరుల చదువులకు ఆటకం కలిగిస్తారు. దీనివల్ల స్నేహితులతో విరోధం, ఆర్థిక ఇబ్బందులు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు. శారీరకంగా బలం తగ్గడం జరుగుతుంది.కొత్త వ్యాపారావకాశాలు వచ్చిపోతాయి. అవసరానికి ఖర్చుచేయకుండా అనవసర ఖర్చులు చేస్తారు. తినే ఆహారాన్ని వృథా చేస్తారు. దీనివల్ల నష్టం. ప్రాణస్నేహితులతో వైరం జాగ్రత్త. ముఖ్యంగా నిరాడంబరంగా ఉండండి. ఈరాశివారికి స్నేహితులతో ఇబ్బందులు, బంధువులతో విరోధాలు, ప్రేమికుల మధ్యవైరాలు. అనవసర ఖర్చులు, రాబడి కంటే ఖర్చు అధిగమవుతుంది. చెడ్డపనులు చేయడం వల్ల చెడ్డపేరు వస్తుంది. అనుకోని గొడవల్లో మాటపట్టింపులు. తల, గొంతకు సంబంధించి సమస్యలు. భవిష్యత్‌ గురించిన ఆందోళన. మీలో నీతి, నిజాయతీ మిముల్ని కాపాడుతుంది. విద్యార్థుల ప్రతిభ చూపడానికి ఈరోజు మంచి రోజు. ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా ఉండదు. స్త్రీలకు బంగారం వంటివి పోగొట్టుకునే అవకాశం జాగ్రత్త. వ్యాపారులకు లాభాలు వచ్చినా మనస్సు చికాకు.

రెమిడీః ఈరోజు అనుకూల శుభఫలితాల కోసం రామరక్షా స్తోత్రం పారాయణం చేయండి.

 

ధనుస్సురాశి : అనుకున్న పనులు పూర్తిచేస్తారు !

ఈరాశివారికి చాలా బాగుంది. ఉన్నతాధికారుల సహకారంతో లబ్ది, ఉద్యోగ, వృత్తి పరంగా మంచిగా ఉంటుంది. విలువైన పత్రాలు, వస్తువులను కొంటారు. పాత బకాయిలు వసూలు. ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా గతంకంటే బాగుంటుంది. ఉన్నతమైన భావాలతో వ్యవహరిస్తారు. నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. చాలారకాల సమస్యలకు పరిష్కారం వెదికే ప్రయత్నం చేస్తారు. సమిష్టిగా ఉంటారు, అందరితో కలుస్తారు. నూతన వ్యాపారాలు చేసే అవకాశం. సకాలంలో స్పందించి అనుకున్న పనులు పూర్తిచేస్తారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వివాహ విషయాలు కలసివస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. టాలెంట్‌ నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. కమిషన్‌ వ్యాపారం బాగుంటుంది. బహుమతులు అందుకుంటారు. గొప్పవ్యక్తుల పరిచయం. రుణాలు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన వస్తువులు అప్పుచేసి కొనుగోలు చేస్తారు. దీనివల్ల వ్యాపార వృధ్ధి సాధిస్తారు. ఆధ్యాత్మిక వృద్ధి, ధనం లభిస్తుంది. రాజకీయ నాయకుల పై నాయకుల పరిచయం వల్ల అనుకూలత. ఉద్యోగస్తులకు ఎప్పటినుంచో పడ్డ శ్రమ కలసివస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. స్త్రీలకు ఇంట్లోవారి అభిమానం, గౌరవం పెరుగుతుంది. సమస్యలు తగ్గుతాయి. వ్యాపారస్తులకు నూతన వ్యాపారం కలసివస్తుంది. అన్నిరకాలుగా కలసివస్తుంది.

రెమిడీః ఈరోజు పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయంచండి. అత్యంత అనుకూల ఫలితాలు వస్తాయి.

 

మకరరాశి : చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు పడుతారు !

ఈరాశి వారికి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. విద్యార్థులు కూడా ప్రతిభను పక్కనపెట్టి అనవసర పనులలో జ్యోకం చేసుకోవడం, చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు పడుతారు. పెద్ద హోదాలో ఉన్నవారు కూడా దిగజారిపోవడం జరుగుతుంది. సమాజంలో గౌరవం తగ్గుతుంది. చేసేపనిలో వృథాగా డబ్బులు ఖర్చుపడుతారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడం, సౌందర్య సంబంధమైన వృథా ఖర్చులు చేస్తారు. పెండ్లికాని పిల్లలకు ఇబ్బందులు, చెడు కోరికలవైపు మొగ్గు చూపిస్తారు. అసభ్యకరంగా మాట్లాడం వల్ల ఇబ్బందులు. క్రమశిక్షణ సన్నగిల్లుతుంది. అనవసరంగా నష్టాలు. అప్పులు చేస్తారు.  వృథాగా డబ్బులు ఖర్చుపెడుతారు., కొత్త వ్యక్తుల పరిచయం వల్ల ఇబ్బందులు. ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖత్వ పెరిగే అవకాశాలు., ,చెడ్డపనుల వైపు మనస్సు మొగ్గు చూపిస్తుంది. అత్యాశ వల్ల లేదా దురాశ వల్ల నష్టం. దేవతాలయ దర్శనం చేయాలని తపిస్తారు., అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఇబ్బందులు. స్త్రీలకు కూడా అంత అనుకూలంగా ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారులకు అంతగా బాగులేదు.

రెమిడీః ఈరోజు అనుకూల శుభఫలితాల కోసం శ్రీదేవీ ఖడ్గమాలను పారాయణం చేయండి. వీలైతే పసుపు, కుంకుమతో అమ్మవారికి అష్టోతరపూజ చేయండి లేదా చేయించండి.

 

కుంభరాశి : మొండి బకాయిలు వసూలు !

ఈరాశివారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. పాతబకాయిలు, మొండి బకాయిలు వసూలు. బ్యాంక్‌ వ్యవహారాలు లాభిస్తాయి. గతంలో ఆగిపోయిన ముఖ్యమైన వ్యవహారాలు పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు. మంచి ఆలోచనలతో ముందడుగు వేస్తారు. మితంగా మాట్లాడి ఎక్కువ పనిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. దీనికి తగ్గ లబ్ది పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌ వచ్చే అవకాశం. వ్యాపార పరంగా అనుకూలత బాగుంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. స్థిరత్వం ఉంటుంది. జీవితభాగస్వామితో ఉన్న సమస్యలు తగ్గుతాయి. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. శత్రువులను జయిస్తారు. తెలివితేటలతో పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. అధికారుల మన్ననలు పొందుతారు. విద్యార్థులకు పోటీలలో పాల్గొని విజయం సాధిస్తారు. స్త్రీలు ఆనందంగా సంతోషంగా ఉంటారు. పుట్టింటి నుంచి శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు చక్కటి లాభాలు వస్తాయి.

రెమిడీః ఈరోజు అత్యంత అనుకూలమైన శుభఫలితాల కోసం శివార్చన, మారేడుదళాలతో ఆరాధనచేయండి.

 

మీనరాశి : తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి !

ఈరాశివారికి కాస్త మనోధైర్యం తగ్గుతుంది. ఐటీ వారికి, షేర్‌ మార్కెట్‌ వారికి నష్టాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం. శత్రువుల వల్ల ఇబ్బందులు. అనవసర గొడవలు పెట్టుకోకండి. ఇతరులతో కోపంగా మాట్లాడుతారు. ఇష్టమైనవారిపై ప్రేమ ఉన్న కోపం ప్రదర్శిస్తారు. మనసులో ఆందోళన ఉంటుంది. అనవసర గొడవలు పెట్టుకొని కావల్సివారిని దూరంగా చేసుకునే అవకాశం. కాస్త సోమరితనం లక్షణం కనిపిస్తుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. కోపం, చిరాకు వస్తాయి. గొడవలు, వివాదాలు వస్తాయి. సంబంధంలేని విషయాలలో తలదూర్చకండి. అహంకారం పెరుగుతుది. రాజకీయంగా అవినీతి మచ్చ. అవకాశాలు వచ్చి చేజారడం. ఉద్యోగస్తులకు ప్రతికూల ఫలితాలు, వత్తిడి, శ్రమకు తగ్గ ఫలితం రాదు. విద్యార్థులు వ్యసనాలకు లోనవుతారు. అనవసరంగా సమయం వృథా చేస్తారు. స్త్రీలకు మనోవేదన, మానసిక ప్రశాంతత ఉండదు. భయం, అనుమానాలతో రోజు గడిచిపోతుంది. వ్యాపారులకు లాభాలు వచ్చినా ఇబ్బందులు ఎదురుకుంటారు.

రెమిడీః మారేడుదళాలతో శివుడికి పూజ, అవకాశం ఉంటే పేదలకు దానధర్మాలు చేయండి.

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju