NewsOrbit
న్యూస్

వ్యాక్సిన్ విషయంలో విజయసాయిరెడ్డి ఓవరాక్షన్ !టిడిపికి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ!!

ఇండియాలో ఏ వ్యాక్సినూ బయటకు రాలేదు. విదేశాల నుంచీ వ్యాక్సిన్లు తెప్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ల పంపిణీ ఎప్పుడు మొదలుపెడతామో చెప్పలేదు. కేవలం పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలంటూ మాత్రమే చెప్పింది.

కాని, విజయసాయిరెడ్డి మాత్రం మరో 9 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలో జనవరి తరువాత వ్యాక్సినేషన్ ఉంటుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. ఏపీలో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌పై ఎటువంటి ప్రక్రియ జరగలేదు. కాని, డిసెంబర్ 25 నుంచి ఏపీలో కరోనా టీకాలు వేస్తామని ప్రకటించారు. జగన్ ఆదేశాలతో 4762 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుందని విజయసాయి ప్రకటించారు.ఏపీలో కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్‌ కార్యక్రమం ప్రారంభం అవుతుందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసేశారు విజయసాయిరెడ్డి. నిజానికి రాష్ట్రంలోనే కాదు కదా.. దేశంలోనే వ్యాక్సినేషన్‌ జరిగే పరిస్థితులు లేవు. వ్యాక్సిన్ అంటూ వస్తే.. ముందు ప్రాధాన్యతా క్రమంలో టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాని, ఏకంగా కోటి మందికి టీకాలు వేయించడానికి రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి.

ఇదంతా విజయసాయిరెడ్డి అత్యుత్సాహంతో పెట్టిన ట్వీటేనంటూ టీడీపీ విమర్శిస్తోంది. అసలు వ్యాక్సినేషన్ విషయం రాష్ట్ర ఆరోగ్య మంత్రికైనా తెలుసా అంటూ ప్రతిపక్షం ఎద్దేవా చేస్తోంది. పైగా జగన్‌గారి ఆదేశాలతో అంటూ ట్వీట్ చేయడం వల్ల సీఎం జగన్‌ను కూడా ఈ అంశంలో ఇరికించారంటూ విమర్శిస్తోంది టీడీపీ.భారత్‌లో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. ప్రముఖంగా మూడు కంపెనీలు టీకా తయారీలో నిమగ్నమై ఉన్నాయి. వీటికి డీసీజీఏ అనుమతి రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా ఇంకా కొనసాగుతూనే ఉంది. పైగా వ్యాక్సిన్లు పంపిణీ చేయాలంటే ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. భారీ ఎత్తున ఫ్రీజర్లు కావాల్సి ఉంటుంది. అవన్నీ రాష్ట్రంలో ఉన్నాయో లేవో తెలీదు. ఎక్కడ స్టోర్ చేస్తారనేది ఆరోగ్య శాఖ అధికారులకు కూడా తెలీదు.

కాని, మరో 9 రోజుల్లో టీకాలు వేయించేస్తామంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేయడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.భారత్ బయోటెక్కే కాదు.. దేశంలోని ఏ కంపెనీ కూడా కూడా వ్యాక్సిన్ విడుదల తేదీని ప్రకటించలేదు . విజయసాయి రెడ్డి మాత్రం ఏకంగా వ్యాక్సినేషన్ తేదీనే ప్రకటించారు. డిసెంబర్ 25 నుంచి కోటి మందికి కరోనా టీకాలు వేస్తామంటూ ట్వీట్ చేశారు. వెంటనే నాలుక కరుచుకున్నారో ఏమో.. ట్విట్టర్‌ నుంచి ఆ పోస్టును తీసేశారు విజయసాయిరెడ్డి.అయినా టిడిపి వదలకుండా విజయసాయి రెడ్డి ని ఎత్తిచూపుతూ జగన్ ని ఫేక్ సీఎం అంటూ మరోసారి విమర్శల వర్షం కురిపించింది.సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో అధికారపక్షం పడిపోయిందనేది రాజకీయ పరిశీలకుల భావన.

 

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju