NewsOrbit
న్యూస్

హ్యాపీ న్యూస్ :ఏలూరు వింత వ్యాధికి కారణాలు తెలిసిపోయాయంటున్న నిపుణులు!

ఏలూరులో వింత వ్యాధికి పురుగుమందుల అవశేషాలే కారణమని ఎయిమ్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.

గత కొన్ని రోజులుగా ఏలూరులో వింత వ్యాధి కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.620మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.మూడు మరణాలు కూడా సంభవించాయి.దీనిపై ఈ వ్యాధి ప్రబలడానికి కారణాలు అంటూ రకరకాల కథనాలు కూడా వ్యాప్తిలో కొచ్చాయి.నీరు కలుషితమైందని ,కూరగాయల లో మితిమీరి వాడిన రసాయనాలు ఈపరిస్థితి తెచ్చాయని చానెళ్లు మోత మోగించాయి.ఈ పరిస్థితుల్లో అసలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణాలేమిటన్న విషయాన్ని కనిపెట్టే బాధ్యతను న్యూఢిల్లీ ఎయిమ్స్ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి సీఎం జగన్ అప్పగించిన సంగతి తెలిసిందే. దీనిపై రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి అందచేయనున్నారు.

అసలు ఈ వ్యాధి ఎలా వ్యాపించిందనే దానిపై ఢిల్లీ ఏయిమ్స్ ప్రతినిధులు శాంపిల్స్ సేకరించారు. దీనిపై అధ్యయనం చేశారు.ఈ క్రమంలో…బుధవారం సీఎం జగన్ వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మనుషుల శరీరాల్లోకి పురుగుమందులు ప్రవేశించాయని వారు జగన్ కి తేల్చి చెప్పారు.అంతేగాక ఈ విషయమై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని నిపుణులు వెల్లడించారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలన్న సీఎం జగన్ సూచించారు. ప్రతి జిల్లాలో కూడా ల్యాబులు ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఫలితాలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఏలూరు తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఆర్బీకేల ద్వారా సేంద్రీయ పద్ధతులు, వ్యవసాయానికి పెద్దపీట వేయాలని సీఎం జగన్ తెలిపారు.ఈ విషయమై రైతులకు, అదే సమయంలో ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కూడా జగన్ ప్రభుత్వం భావిస్తోంది.అక్కడక్కడా ఏలూరు లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై కూడా సీఎం ఆరా తీశారు.ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ఆయా జిల్లాల అధికారులను జగన్ ఆదేశించారు.

 

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju