దేశంలోని అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల్లో ఒకటి.. జీవిత బీమా సంస్థ ఎల్ఐసి అనుబంధ సంస్థ అయిన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసిహెచ్ఎఫ్ఎల్) 20 ఐటీ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ముంబై కేంద్రంగా దేశవ్యాప్తంగా కార్యకలాపాలు కొనసాగిస్తుంది.. ఇందులో మేనేజ్మెంట్ ట్రెయినీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి.. ఆసక్తి, అర్హతలున్న వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా..
మొత్తం ఖాళీలు : 20
1. అసిస్టెంట్ మేనేజర్ (డేటాబేస్ ,అడ్మినిస్ట్రేటర్, వెబ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇంజనీరింగ్, మొబైల్ యాప్ డెవలపర్) -11 పోస్టులు
వయసు : 24-30 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు : 60% మార్కులతో కంప్యూటర్స్ సైన్స్, ఐటీ ఫుల్ టైం ఎంసీఏ, బీఈ, బీటెక్, బీఎస్సి ఉతీర్ణత, ఏడాది పాటు అనుభవం తప్పనిసరి.
జీతం : అసిస్టెంట్ మేనేజర్- రూ.10-14 లక్షలు.
2. మేనేజ్మెంట్ ట్రెయినీ -09 పోస్టులు.
వయసు : 25-30 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు : 60% మార్కులతో కంప్యూటర్స్ సైన్స్, ఐటీ ఫుల్ టైం ఎంసీఏ, బీఈ, బీటెక్, బీఎస్సి ఉతీర్ణత, ఏడాది పాటు అనుభవం తప్పనిసరి.
జీతం : మేనేజ్మెంట్ ట్రెయినీ – రూ. 25000,
ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేసి, వారికీ ఆన్లైన్ టెక్నికల్ టెస్ట్ నిర్వహిస్తుంది. 50 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
వెబ్ సైట్ : www.lichousing.com
దరఖాస్తులకు చివరి తేదీ : 31/12/2020.