NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అగ్రిగోల్డ్‌‌లో ఈడీ కీలక అడుగు..! భారీ ఆస్తులు, భూములు అటాచ్..!!

 

తెలుగు రాష్ట్రాలతో సహా కర్నాటక రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇప్పటికే సీఐడీ కేసులో అరెస్టు అయి బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యవస్థాపకులు అవ్వ వెంకట రామారావు, అవ్వ వెంకట శేషు నారాయణరావు, అవ్వ హేమసుందర వరప్రసాద్‌ను మంగళవారం రాత్రి హైదరాబాద్ లో అరెస్టు చేసి బుధవారం చంచల్‌గూడ జైలుకు తరలించిన ఈడీ అధికారులు.. తాజాగా ఈ సంస్థకు ఏపి, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలో ఉన్న రూ.4109 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. దాదాపు 48 ఎకరాల్లో గుంటూరు జిల్లాలో ఉన్న హాయ్‌లాండ్ ను సైతం ఈడీ అటాచ్ చేసింది.

అగ్రి గోల్డ్ యాజమాన్యం ఏపి, తెలంగాణతో పాటు మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో 32 లక్షల ఖాతాలు, 19,18,865 మంది డిపాజిటర్ల నుండి సుమారు 6,380 కోట్ల  రూపాయలు వసూలు చేసింది. అత్యధికంగా ఏపిలోనే 11.58 లక్షల మంది డిపాజిటర్లు ఉండగా తెలంగాణలో 1.67 లక్షల మంది, కర్నాటకలో 4.81 లక్షల మంది డిపాజిట్‌లు చేశారు.

అగ్రిగోల్డ్ యాజమాన్యం.. లక్షలాది మంది ఖాతాదారులను మోసం చేసిన కేసులో సీఐడీ దర్యాప్తు చేస్తుండగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. కేసు తదుపరి విచారణలో భాగంగా జుడీషియల్ రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఈడీ అధికారులు సిద్దమవుతున్నారు. అగ్రి గోల్డ్ యాజమాన్యం ఖాతాదారుల సొమ్మును వ్యక్తిగత ఖాతాలు, ఇతర వ్యాపారాల్లోకి మళ్లించడంతో పాటు విదేశాలలో పెట్టుబడులు పెట్టినట్లుగా కూడా ఈడి అధికారులు గుర్తించారు.

Related posts

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?