NewsOrbit
న్యూస్

రైతాంగ ఆందోళనల ఎఫెక్ట్ ..! హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ..!!

 

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన పెద్ద సంఖ్యలో రైతాంగం 45 రోజులకుపైగా ఢిల్లీ వద్ద ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటి నుండి పై రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేస్తున్నాయి. ఈ తరుణంలో హర్యానాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో మూడు మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు జరగ్గా రెండు కార్పోరేషన్ లలో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. రేవారి మున్సిపల్ కౌన్సిల్, మూడు మున్సిపల్ కమిటీలకు ఎన్నికలు జరగ్గా రేవారిలో బీజెపీ గెలుపొందింది. మిగిలిన స్వతంత్రులు దక్కించుకున్నారు.

తొలి సారిగా అంబాలా, పంచకుల, సోనిపట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించారు. వీటితో పాటు దరోహర (రేవారి), సంప్లా (రోహతక్), హిసార్ (ఉక్లాన్) మున్సిపాలిటీలకు ఈ నెల 27న పోలింగ్ జరగ్గా బుధవారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంవత్సరం తరవాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార బీజెపీ, జన నాయక్ జనతా పార్టీ (జెజెపి, ఉప ముఖ్యమంత్రి దుష్వంత్ చౌతాలా) కూటమి ఒక వైపు, కాంగ్రెస్ కూటమి మరో వైపు ఎన్నికల బరిలో నిలిచాయి. రైతులు ఆందోళన చేస్తున్న సింఘు సరిహద్దు సమీపంలో గల సోనిపట్ మేయర్ స్థానాన్ని 14వేల ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుచుకుంది. నిఖిల్ మదన్ తొలి మేయర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. అంబాలాలో కాంగ్రెస్ కూటమమిలోని హర్యానా జన చైతన్య పార్టీ (హెచ్‌జెపీ)కి చెందిన కేంద్ర మాజీ మంత్రి వినోద్ శర్మ సతీమణి శక్తి రాణి శర్మ మేయర్‌ కానున్నారు. దరుహెరాలో, ఉక్లాన్ లో బీజెపి ఓటమి చెందగా స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. సంప్లాలో బిజేపీ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పంచకులలో బీజేపీ కూటమి గెలిచింది.

 

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju