అమెరికాకు చెందిన ప్రముఖ పాప్ గాయని జెన్నీఫర్ లోఫెజ్ నాలుగో పెళ్లి చేసుకోనుంది. బేస్బాల్ మాజీ ప్లేయర్ అలెక్స్ రాడ్రిగేజ్తో జెన్నీఫర్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. జెన్నీఫర్ చేతికి అలెక్స్ ఉంగరం తొడిగిన ఫోటోను పోస్ట్ చేశారు.
జెన్నీఫర్కు ఇది వరకు మూడు సార్లు పెళ్లైంది. 11 ఏళ్ల వయసున్న కవలలకు ఆమె తల్లి. అలాగే అలెక్స్ కూడా ఇది వరకే వివాహమైంది. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. జెన్నీఫర్ కంటే అలెక్స్ ఆరేళ్లు చిన్నవాడు. గత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్న వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.
previous post
next post
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!