NewsOrbit
జాతీయం న్యూస్

కరోనా వచ్చి తగ్గిందా..!? రిలాక్స్ వద్దు..! భయపెడుతున్న కొత్త శోధన..!!

ప్రపంచమంతా కరోనావైరస్ వ్యాపించి ఉంది. మన భూమిమీద ఎక్కడికి వెళ్లినా కరోనా వైరస్ విస్తరించి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నుంచి ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామందిలో కరోనా ఎప్పుడు వచ్చిపోయిందో కూడా తెలియని పరిస్థితి.

కరోనా టెస్టు చేయించుకుంటే తప్పా కరోనా ఉందనే సంగతి తెలియడం లేదు. ఇదిలా ఉండగా కరోనా సోకిన తర్వాత కోలుకున్నవారిలో ఓ కొత్త సమస్య వెంటాడుతోంది.కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వారిలో వైరస్ లక్షణాలు 6 నెలల వరకు అలానే ఉంటాయని వుహాన్ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇదే ఇప్పుడందరికీ ఆందోళన కలిగించే అంశం. కరోనా వచ్చిపోయిందిగా ఇక తమకేమీ ఢోకాలేదని భావించేవారు బిక్కచచ్చిపోయే నిజాలు ఈ అధ్యయనంలో తేలాయి!

ఆ అధ్యయనం సారాంశం ఏమిటంటే!

కరోనాతో ఆస్పత్రిలో మొదటగా చేరిన కొంతమంది నమూనాల ఆధారంగా వుహాన్ రీసెర్చర్లు అధ్యయనం చేశారు. ఇందులో కరోనా లక్షణాలు కనీసం 6 నెలల వరకు అంతర్గతంగా ఉంటాయని కనుగొన్నారు. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలోని వుహాన్ సిటీలో కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన 1,733పై అధ్యయనం చేశారు.కరోనా లక్షణాలు బయటపడకముందే చాలామంది ఆస్పత్రిలో చేరారు. మొత్తంగా మూడు త్రైమాసికాలుగా కరోనా పేషెంట్లను విభజించారు. వారిలో కరోనా సోకినట్టు నిర్ధారణ అయినప్పటి నుంచి కనీసం 6 నెలల పాటు వైరస్ లక్షణాలు అలానే ఉన్నాయంట. 63శాతం కరోనా బాధితుల్లో ఇంకా అలసట లేదా కండరాల బలహీనత లక్షణాలు ఉండగా.. 23శాతం మందిలో ఆందోళన లేదా తీవ్ర ఒత్తిడి, మరో 26 శాతం మందిలో నిద్రలేమి వంటి సమస్యలు అధికంగా ఉన్నాయని గుర్తించారు.

డిశ్చార్జ్ అయ్యాక కూడా వెంటాడే వైరస్!

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక దాదాపు ఎక్కువమంది కరోనా బాధితుల్లో కనీసం కొన్ని నెలల పాటు వైరస్ లక్షణాలతో బాధపడినట్టు పరిశోధకులు తమ అధ్యయనంలో విశ్లేషించారు. న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరినవారంతా కరోనా బాధితులుగా నిర్ధారించలేమని, వారిలో మరో అనారోగ్య సమస్యకు దారితీసి ఉండొచ్చునని అంటున్నారు. కరోనా తీవ్ర లక్షణాలతో బాధపడినవారిలో ఆరు నెలల తర్వాత కూడా శ్వాసపరమైన సమస్యలను ఎదుర్కొన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు.

 

Related posts

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju