NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Delhi Riots .. రైతులు పోలీసుల మధ్య వార్..! రైతుల వెనుకున్నది ఎవరు?

BJP Narendra Modi: BJP Will blame PM in Failures

Delhi Riots .. దేశ రాజధాని సాక్షిగా రైతులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ War ని తలపిస్తోంది. అసలు రైతుల వెనుకున్నది ఎవరు? అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. Indiaకి అన్నం పెట్టే Farmer ఒక వైపు.. వ్యవస్థల్ని కాపాడే Police మరో వైపు. ప్రజలకు బాసటగా నిలవాల్సిన వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణ ప్రజలను విస్మయంలో పడేస్తోంది. India Freedom కోసం జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో గోడలెక్కి పారిపోతున్న భారతీయులను బ్రిటిషర్లు కాల్చి చంపిన ఘటన మనం సినిమాల్లో చూశాం. అంతటి హింస లేకపోయినా ఇక్కడ మన రైతులే.. మన పోలీసులపై చేసిన దాడికి వాళ్లు గోడలు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఏకంగా 300 మంది పోలీసులు రైతుల చేతిలో దెబ్బలు తిని గాయపడ్డారు. ఒక రైతు మృతి చెందాడు. Indiaలో అందునా Capital Delhiలో జరిగిన ఈ దారణం ప్రపంచానికి India నుంచి వెళ్లాల్సిన సంకేతాలు కాదు.

who is behind the farmers in delhi riots
who is behind the farmers in delhi riots

ప్రధానికే రక్షణ బాధ్యత పట్టదా..?

దేశ ప్రధాని ఏదైనా రాష్ట్రానికో, ప్రాంతానికో పర్యటనకు వెళ్తేనే అత్యంత పకడ్బందీగా రక్షణ కల్పిస్తారు. రెండు రోజుల ముందుగానే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. స్థానిక పోలీసులు ఎంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. అటువంటిది ఢిల్లీలో.. అందునా గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో వేలాది మంది రైతులు ఆ ప్రాంతానికి ఎలా చేరుకున్నారనేది ప్రశ్నగా మారింది. నిజంగా ఇది నిఘా వైఫల్యమే. సాధారణ పరిస్థితుల్లో ప్రధానికి కట్టుదిట్టమైన రక్షణ కల్పించి.. వేలాది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీలో నిరసనలకు వస్తున్నారని తెలిసి ఇంకెంత భద్రత తీసుకోవాలి? కానీ.. పోలీసుల వైఫ్యల్యంతో ఏకంగా రైతులు ఎర్రకోటపైకి చేరుకునే వరకూ పరిస్థితులు వెళ్లాయంటే ఇది భారత్ కే అవమానం. అదీ.. రిపబ్లిక్ డే రోజున ప్రధాని వస్తున్న సమయంలో. స్థానిక పరిస్థితులు తెలిసి ఆ ప్రాంతానికి వచ్చే దారులన్నీ మూసేయాల్సిన పోలీసులు, నిఘా వ్యవస్థ సరిగా పని చేయలేదు. చెప్పిన రూట్ కాకుండా వేరే మార్గంలో రైతులు అక్కడికి చేరుకున్నారన్నది పోలీసులు చెప్తున్న మాట. ఇది సరైంది కాదు.

కేంద్రం తీరే కారణమా..?

ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వ తీరే కారణమా? అంటే అవుననే సమాధానమే చెప్పాలి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పట్టుబట్టిన రైతులు నెలలు గడుస్తున్నా వెనకడుగు వేయడం లేదు. మొన్నటివరకూ పంజాబ్, హర్యానా వరకే పరిమితమైన ఆందోళన ఇప్సుడు మహారాష్ట్ర వరకూ చేరుకుంది. ఏకంగా ట్రాక్టర్లతో నిరసన తెలిపుతూ ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికి రైతులతో 9 సార్లు చర్చలు జరిపి కేంద్రం సాధించింది శూన్యం. సుప్రీంకోర్టు చొరవ తీసుకుని కేంద్రానికి మొట్టికాయలు వేయడంతో కొన్నాళ్లపాటు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తామని ప్రకటించడం తప్ప కేంద్రం చేసింది ఏమీ లేదు. అసలెందుకు బలవంతంగా వ్యవసాయ చట్టాలు అమలు చేస్తున్నారో ఇప్పటికీ కేంద్రం స్పష్టం చేయడం లేదు. వారు చెప్తున్న కారణాలను రైతులు కూడా ఒప్పుకోవడం లేదు. ఎవరూ తగ్గడం లేదు.. ఇద్దరూ దేనికీ అంగీకరించడం లేదు. కార్పొరేట్ పాలనగా పేరుబడ్డ బీజేపీ ప్రభుత్వ తీరు.. పారిశ్రామిక దిగ్గజాలకు కొమ్ముకాస్తున్నారనే నింద ఉన్న ప్రధాని మోదీనే ఇందుకు కారణం అని చెప్పాలి.

Delhi Riots రైతుల వెనుకున్నది ఎవరు..?

2008లో వ్యవసాయ చట్టం తీసుకురావాలన్న పంజాబ్ రైతులే ఇప్పుడు ఈ చట్టాలు వద్దంటున్నారు. రైతులే ఇలా అనడంతో వీరి వెనుక ఎవరో ఉండి ఈ తతంగం నడిపిస్తున్నారని బీజేపీ మాట. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ లో రైతుల వెనుక కాంగ్రెస్ ఉండి ఇదంతా నడిపిస్తుందా అనే వాదనా లేకపోలేదు. సంయుక్త్ కిసాన్ మోర్చా, రైతు సంఘాలు కేంద్రంపై పోరాటానికే ముందుకెళ్తున్నాయి. ఎవరి ప్రోద్బలం చూసుకుని వారు నెలలుగా ఢిల్లీలో పోరాటం చేస్తున్నారనేదే ప్రశ్న. కాంగ్రెస్ హయాంలో కావాలని.. బీజేపీ హయాంలో వద్దంటున్న రైతులను మాత్రం ఎంతకు నమ్మేది. ఉత్తరాదిలో మూడు రాష్ట్రాలకే పరిమితమైన ఉద్యమం దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోని రైతులకు ఎందుకు పట్టడం లేదనేది కూడా మరొక ప్రశ్న. ఏపీ మొదటే వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇస్తే.. తెలంగాణ మొదట్లో వ్యతిరేకించి ఇప్పుడు మద్దతిస్తోంది. రైతులను ప్రభుత్వం మీద దాడికి పంపిస్తే ఎవరికి ఉపయోగం అనేది తేలాల్సిన అంశం. ఈస్థాయి ఆందోళన దేశవ్యాప్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదే..!

Related posts

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?