NewsOrbit
జాతీయం న్యూస్

Delhi : ఢిల్లీ పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ కి డైలమాలో పడ్డా రైతు సంఘం నేతలు..!!

Delhi : గత కొద్ది నెలల నుండి దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Farmers' union leaders in dilemma over twist given by Delhi police .. !!
Farmers’ union leaders in dilemma over twist given by Delhi police .. !!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దులలో భారీ స్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఇటీవల రిపబ్లిక్ డే నాడు రైతు సంఘాలు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించగా.. ఆ ర్యాలీ చివరాకరికి తీవ్ర హింసకు దారితీయడంతో రైతు సంఘం నేతలకు పోలీసులకు మధ్య తోపులాట మరియు లాఠీఛార్జ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక రైతు చనిపోగా మరికొంత మంది పోలీసులు గాయాల పాలయ్యారు. దీంతో ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి తాజాగా పోలీసులకు సరికొత్త ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో సమావేశం అనంతరం నిందితులైన రైతు సంఘం నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా నిందితులు ఎవరు కూడా విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలని వెంటనే వాళ్లకు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేయాలని కేంద్ర హోం శాఖ తెలపడంతో ఢిల్లీ పోలీసులు రైతు సంఘం నేతలకు నోటీసులు జారీ చేశారు.

మొత్తం ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటన పై 25 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ లను నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎర్రకోట పై జరిగిన దాడి కేసులో పంజాబ్ సినీ నటుడు డీప్ సిద్ధూ గ్యాంగ్ స్టర్ గా మారిన రాజకీయ నేత మాల్వా యాత్ లఖ్ బీర్సింగ్ లపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఏదిఏమైనా గత కొంత కాలం నుండి శాంతియుత వాతావరణంలో రైతులు చేస్తున్న ఆందోళనలు నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు వచ్చిన క్రమంలో రిపబ్లిక్ డే నాడు జరిగిన హింసాత్మక ఘటన.. రైతు ఉద్యమం పై చెడ్డ పేరు తీసుకు వచ్చినట్లయింది. ఏకంగా ఢిల్లీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో రైతు సంఘం నేతలు డైలమాలో పడినట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. పబ్లిక్ డే నాడు జరిగిన పరిణామంతో ఢిల్లీ శివార్లలో ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలను పోలీసులు మరోపక్క ఖాళీ చేయించే పనిలో నిమగ్నమయ్యారు.

 

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?