Pradeep Machiraju: ప్రస్తుతం మన తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా పేరు సంపాదించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. కేవలం బుల్లితెర పైనే కాకుండా త్వరలోనే వెండి తెర మీద కూడా నటనతో తన సత్తా చాటుకోవడానికి ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రదీప్. నిజానికి ఈ సినిమా గత ఏడాది ఆడియెన్స్ ముందుకు రావలిసింది. కానీ కరోనా విజృంభిస్తూ ఉండడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్ర సిబ్బంది ఇప్పటికే ‘నీలి నీలి ఆకాశం’ పాటను రిలీజ్ చెయ్యగా ఇది పాపులర్ కావడం సినిమాకు ప్లస్ అవుతుందనే ఆశతో ఉన్నారు చిత్ర సిబ్బంది. యాంకర్‌గా ప్రదీప్ మాచిరాజు తన సెన్స్ అఫ్ హ్యూమర్ తో ఎంతో మంది అమ్మాయిల ఫేవరేట్‌గా మారాడు. అయితే ఎప్పటి నుంచో టాలీవుడ్ లో ప్రదీప్ ఎప్పుడు తన బ్యాచలర్ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పెడతాడు అనే విషయం పై చర్చ జరుగుతోంది.
ప్రదీప్ తాజాగా తన పెళ్లి గురించి మరోసారి రియాక్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రదీప్ ను మీకు ప్రేమ వివాహం చేసుకోవాలని ఉందా లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలని ఉందా అని ప్రశ్నించగా ప్రదీప్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ సమాధానం వచ్చింది. దీనికి సమాధానంగా తనకు లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనకు లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు ఇష్టమో కూడా చెప్పాడు. ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే చివరికి పెద్దలను ఒప్పించాలి కాబట్టి లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ ను చేసుకుంటా అని స్పష్టం చేసాడు.
ప్రదీప్ ని ఆ తరువాత, 2021లో మీ పెళ్లి ఉంటుందా అని అడగగానే ఆ ప్రశ్నకు వెంటనే నో అనే సమాధానం చెప్పేశాడు. ఈ ఏడాది ఎట్టి పరిస్థితులలోనూ తన పెళ్లి ఉండదని స్పష్టంగా చెప్పేసాడు. వెంటనే మీ పెళ్లి గురించి ఎంతోమంది ఎదురుచూస్తున్నారు అనగానే, తమ పేరెంట్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారని తెలిపాడు.