NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Budget : బడ్జెట్ 2021 : ఆరు ప్రాధాన్యతా రంగాలకు భారీగా నిధులు

Budget : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడవ సారి 2021 -22 బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ యాప్ ను విడుదల చేశారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో విపక్ష సభ్యులు.. కేంద్ర ప్రవేశపెట్టిన మూడు సాగుచట్టాలకు నిరసనగా నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల నిరసన మధ్యనే నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కరోనా లాక్ డౌన్ దెబ్బకు కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్ డీ ఏ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కేంద్ర మంత్రి వివరించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్ లో పొందుపరిచినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

Budget : budget 2021 fm announces rs 64180 crore atmanirbhar health yojana
Budget : budget 2021 fm announces rs 64180 crore atmanirbhar health yojana

ఈ బడ్జెట్ లో ఆరు ప్రాధామ్యాలను ఎంచుకున్నట్లు చెప్పారు. తొలి ప్రాధాన్యంగా వైద్య ఆరోగ్యం, రెండో ప్రాధాన్యంగా మౌళిక రంగం, మూడో ప్రాధాన్యత సమ్మిళిత అభివృద్ధి, నాల్గవ ప్రాధాన్యత మానవ వనరులు, నైపుణ్య అభివృద్ధి, అయిదవ ప్రాధాన్యత గా ఇన్నోవేషన్ అండ్ ఆర్ అండ్ డీ గా పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆరేళ్ల కాలానికి గానూ రూ.64,180 కోట్లతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..దేశ వ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం రూ.35  వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మెగా టెక్స్ టైల్ ఇన్వెస్ట్ మెంట్ పార్కుల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే మూడేళ్లలో ఏడు  టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. వాయుకాలుష్య నివారణకు రూ.2,217 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ఈ ఏడాది బడ్జెట్ లో అయిదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5వేల కోట్లు కేటాయించారు. కేరళలో 11వేల కిలో మీటర్ల జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్ లో ప్రత్యేక దృష్టి పెట్టారు. దానిలో భాగంగా పశ్చిమ బెంగాలో లో రూ.25వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తమిళనాడులో రహదారుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించారు. అస్సోంలో రహదారుల అభివృద్ధికి రూ.19వేల కోట్ల కేటాయించారు. కోల్ కతా – సిలిగురి రహదారి విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు.

తయారీ రంగం మద్దతు కోసం ప్రత్యేక ఆర్థిక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ కోసం రూ.20వేల కోట్ల మూలధనం కేటాయించనున్నట్లు వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అందుబుటలోకి రూ.5లక్షల  కోట్ల రుణాలు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రైల్వేలకు రూ.1.10లక్షల కోట్లు కేటాయించించారు. 2023 నాటికి రైల్వే లైన్లు విద్ద్యుదీకరణ పూర్తి చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 1938 భీమా చట్టానికి సవరణలు చేస్తున్నట్లు తెలిపారు. భీమా కంపెనీల్లో ఎఫ్ డీ ఐలు పరిమితి 74 శాతానికి పెంచినట్లు తెలిపారు. పలు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గెయిల్, ఐవోసీ, హెచ్‌పిసిఎల్ పైపులైన్ లో పెట్టుబడుల ఉపసంహరిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా రెండు ప్రభుత్వ బ్యాంకుల్లో, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మరో కోటి మంది లబ్దిదారులకు ఎల్పీజీ ఉజ్వల యోజన అందాబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 27 సిటీలకు మెట్రో విస్తరణ చేస్తున్నట్లు తెలిపారు. చెన్నై మెట్రో ఫేజ్ 2 కి రూ.63.246 కోట్లు, బెంగళూరు మెట్రోకు రూ.14.788 కోట్లు, కొచ్చి మెట్రో ఫేజ్ 2 కు రూ.1,957 కోట్లు, బస్ ట్రాన్స్ పోర్టు పథకం కు రూ.18వేల కోట్లు, మెట్రో న్యూ, మెట్రో లైట్ పేరుతో కొత్త ప్రాజెక్టులను తీసుకువస్తున్నట్లు తెలిపారు.

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?