NewsOrbit
న్యూస్

jayalalitha : అమ్మ వారసురాలి మార్క్… శశి వ్యూహం!!

అమ్మ వారసురాలి మార్క్... శశి వ్యూహం!!

jayalalitha :తమిళనాడు రాజకీయాల్లో అమ్మగా అమ్మ వారసురాలి  అందరికి సుపరిచితురాలైన దివంగత సీఎం జయలలిత వారసత్వం కోసం తమిళనాడు రాజకీయాల్లో వ్యూహాత్మక ఎత్తుగడలు సాగుతున్నాయి. ఇటీవలే జైలు నుంచి విడుదలైన జయలలిత jayalalitha నెచ్చెలి శశికళ అమ్మ వారసత్వం కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. ఆమె లోటును భర్తీ చేసేందుకు శశికళ ఆమె హావభావాలతో పాటు… జయలలిత వినియోగించిన కారును సైతం వినియోగిస్తూ తమిళనాడు రాజకీయాల్లో జయలలిత మార్క్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

a huge plan for jayalalitha's inheritance
a huge plan for jayalalitha’s inheritance

jayalalitha అన్నా డీ ఎంకే జెండా తో!!

ఇటీవల జైలు నుంచి విడుదలైన శశికళ ఆ తర్వాత కరోనా బారినపడి ఆస్పత్రిలో వెంటిలేటర్ చికిత్స వరకు వెళ్లారు. అయితే కరోనా నుంచి కోలుకుని ఇటీవల డిశ్చార్జి అయిన శశికళ ఆమె ఉపయోగించే కారు మీద అన్నాడిఎంకె పార్టీ జెండా ఉండటం… ఆమె సైతం కార్యకర్తలను, జయలలిత మాదిరి పలకరించడం తో పాటు… జయలలిత హావభావాలను మీడియా ముందు చూపిస్తూ జయలలితను మరోసారి గుర్తు చేస్తూ ఆమె వారసురాలిగా ఆమెకు అత్యంత ఆప్తులు రాలిగా ఉన్న తన మార్కు ను మరింత విస్తృతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు శశికళ అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టారు. శశికళ ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సందర్భంగా పలువురు అన్నాడీఎంకే కార్యకర్తలు నాయకులు ఆమెకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు పెట్టడం… ఆమె బయటకు వచ్చినప్పుడు అన్నాడీఎంకే కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలకడం ఇవన్నీ అన్నాడీఎంకేతో చీలిక తెచ్చే సంకేతం గా భావిస్తున్నారు. మరోపక్క అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు సైతం శశికళకు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఎన్నికల ముందు శశికళ పార్టీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరెవరు వెళ్తారు ఎలా వెళ్తారు వారికి టికెట్లు ఏ పార్టీ నుంచి వస్తాయి అన్నది అసలైన ప్రశ్న. అన్నాడీఎంకే జెండాను ఉపయోగిస్తూ శశికళ కారు ఉపయోగించడాన్ని అన్నాడీఎంకే నాయకులు సైతం ఖండిస్తున్నారు. ఆమెను పార్టీ సస్పెండ్ చేసిందని… అలాంటి శశికళ కారు మీద ఎలా పార్టీ జెండాను ఉంచుకుంటారు అంటూ అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ మంత్రి వ్యాఖ్యానించారు.

2027 వరకు పోటీ కుదరదా??

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శశికళ ఇటీవల విడుదల అయినప్పటికీ వచ్చే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిబంధనలు ఒప్పుకోమని న్యాయనిపుణులు చెబుతున్నారు. జైలు శిక్ష అనుభవించి నేరం నిరూపించిన వారు చట్టసభలకు వెళ్లడానికి నిబంధనలు అనుమతించవు. దీని ప్రకారం శశికళ 2027 నాటి మాత్రమే పోటీ చేయడానికి అర్హురాలు అవుతుంది. అంటే వచ్చే శాసనసభ ఎన్నికల్లో శశికళ పోటీ చేయడానికి లేదు. మరి ఆమె పార్టీ తరఫున ఎవర్ని నుంచో పెడతారు..? ఆ మేనల్లుడు దినకరన్ కు పార్టీ పూర్తి బాధ్యతలు అప్పగిస్తార?? లేక పార్టీని అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునేలా చూస్తారా? బిజెపి ను ఎలా ఒప్పిస్తారు?? అసలు బీజేపీ శశికళ రాకను ఎంతమేర సమర్ధిస్తుంది వ్యతిరేకిస్తుంది అన్నది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారింది. దీంతో పాటు శశికళ వేసే ప్రతి అడుగు రాజకీయంగా వేసే ప్రతి ఎత్తుగడలో ఇటు బిజెపి అటు అన్నాడీఎంకే నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆమెతో పరిచయం ఉండే ఎమ్మెల్యేలపై… టచ్ లో ఉండే నేతలపై అన్నా డీఎంకే ప్రభుత్వం నిఘా ఉంచింది. అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వ పెద్దల పనులన్నీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అసలు శశికళ ఏం చేయబోతున్నారు తమిళనాడు రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్న అన్నది ఆసక్తికరంగా మారింది. మరోపక్క శశికళ సైతం జయలలిత పాడిన కారును ఆమె హావ భావాలను పలుకుతూ ఉండటం కూడా తమిళనాట రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. జయలలిత వారసత్వం కోసం… సానుభూతి కోసం శశికళ ప్రధానంగా ఈ వ్యూహం ఎంచుకున్నట్లు తమిళ్ మీడియా చర్చ చేస్తోంది.

 

author avatar
Comrade CHE

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju