NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Hyderabad Mayor Election : కేకే కుమార్తెకే “మహా” కిరీటం!

Hyderabad Mayor Election : కేకే కుమార్తెకే "మహా" కిరీటం!

Hyderabad Mayor Election : హైదరాబాద్ మేయర్ ఎలెక్షన్స్ Hyderabad Mayor Elections తెరాస అధినేత కెసిఆర్ అన్ని సమస్య తూకలు వేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పై దాదాపు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సీనియర్ నాయకుడు కె.కేశవరావు పెద్ద కుమార్తె గద్వాల విజయలక్ష్మిని హైదరాబాద్ మేయర్ చేసేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. జనరల్ మహిళలకు రిజర్వు అయిన మేయర్ పీఠం మీద కేకే కుమార్తె విజయలక్ష్మి కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది.

all-suspence-is-shut-in-hyderabad-mayor-elections
all-suspence-is-shut-in-hyderabad-mayor-elections

అప్పట్లో పౌరసత్వ దుమరం!

2015 లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లోనే గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పీఠాన్ని ఆశించారు. కేశవరావు సైతం కేసీఆర్తో మంతనాలు జరిపి విజయలక్ష్మిని హైదరాబాద్ మొదటి పౌరురాలు చేయాలని ఆశించారు. అయితే వారికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. 2015 లో బంజారాహిల్స్ నుంచి మొదటి సారి కార్పొరేటర్ గా గెలిచిన ఆమెకు భారతదేశ పౌరసత్వం విషయంలో ఆటంకం ఏర్పడింది. 1988లో అనే అమెరికన్ గ్రీన్కార్డ్ హోల్డర్ ను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయిన విజయలక్ష్మి 1999లో అమెరికా పౌరసత్వాన్ని సైతం తీసుకున్నారు. 2004లో మళ్లీ కుటుంబసమేతంగా ఆమె ఇండియాకు తిరిగి వచ్చారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకోవాలని చురుగ్గా ప్రజల్లో తిరగడం మొదలు పెట్టారు. అయితే 2009 నాటికి ఆమెకు మళ్లీ భారత పౌరసత్వం దక్కింది. ఇండియన్ సిటిజన్ షిప్ యాక్ట్ 1955 లోని సెక్షన్ 5 ప్రకారం భారత పౌరసత్వం తీసుకున్నాక ఖచ్చితంగా 15 సంవత్సరాలు రాజకీయాలకు, రాజ్యాంగబద్ధ పదవులకు దూరంగా ఉండాలని ఉన్న నేపథ్యంలో ఆమెకు హైదరాబాద్ మేయర్ పీఠం అప్పట్లో దూరమైంది.

ఆలయాలు కట్టించి !

విజయలక్ష్మి ఆధ్యాత్మిక విషయాల్లో ముందుంటారు. ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న బంజారాహిల్స్ ప్రాంతంలో రెండు ఆలయాలను ఇటీవల నిర్మించారు. హిందూ ధర్మాన్ని ఆచరించడం తన కర్తవ్యం అంటూ ఆమె పదేపదే చెబుతుంటారు. ఆలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమానికి విజయలక్ష్మి తరచూ హాజరవుతూ ఉంటారు. మేయర్ ఎన్నిక సందర్భంగా బుధవారమే ఆమె తిరుమల వచ్చి శ్రీవారి దర్శనం చేసుకొని, అంతా సజావుగా జరగాలని మొక్కుకున్నారు. నిత్యం ఆమె ఆధ్వర్యంలో ఉండే ఆలయాల వద్ద అన్నదానాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవ్వడం విజయలక్ష్మి స్టైల్. ఆమె హిందుత్వం విషయంలో ఆధ్యాత్మిక విషయంలో ఎప్పుడూ బహిరంగంగానే తన ఇష్టాన్ని చెబుతుంటారు.

ఉప మేయర్ మీద స్పష్టత!

2015 హైదరాబాద్ మేయర్ పీఠం మీద బీసీ అభ్యర్థిని కూర్చోబెట్టిన కెసిఆర్ ఈసారి ఉప మేయర్గా రెడ్డి వర్గానికి చెందిన వారికీ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. తార్నాక నుంచి గెలిచిన లతా శోభన్ రెడ్డి ని ఉప మేయర్గా కెసిఆర్ ప్రతిపాదించినట్లు తెలిసింది. రిజర్వేషన్ల దామాషా ప్రకారం ఈసారి హైదరాబాద్ మేయర్ పీఠం జనరల్ మహిళలకు కేటాయించారు. దీంతో టీఆర్ఎస్ కు దూరం అవుతున్నారని కెసిఆర్ భావిస్తున్న రెడ్డి వర్గానికి ఈసారి ఇవ్వాలని మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు దుబ్బాక ఉప ఎన్నికలు జరిగిన ఓటమి కారణాలను విశ్లేషించడం తో పాటు గతంలో గద్వాల విజయలక్ష్మికి కేసీఆర్ హామీ మేరకు ఆమెను మేయర్ పీఠం మీద రెడ్డి వర్గానికి చెందిన మహిళను ఉప మేయర్ చేయడానికి గులాబీ బాస్ నిర్ణయించినట్లు తెలిసింది.

మజ్లీస్ మద్దతు తీసుకుని..

మేయర్ ఎన్నికల్లో మేజిక్ మార్కు కు 10 సీట్ల దూరంలో ఉండి పోయిన అధికార పార్టీ టిఆర్ఎస్ కు మజ్లీస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు దాదాపు అవగాహన కుదిరినట్లు తెలిసింది. ఎలాంటి షరతులు లేకుండా మజ్లీస్ టిఆర్ఎస్ కు బయటి నుంచి మద్దతు ఇచ్చి కనీసం ఎలాంటి పదవులు ఆశించకుండా మేయర్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీ తో మాట్లాడినట్లు తెలిసింది. టిఆర్ఎస్ మజ్లిస్ స్నేహం ఈ విషయంలో బిజెపి ఎక్కడ లావు పడకుండా ఉండేందుకు ఎత్తు వేసినట్లు అర్థమవుతుంది. మధ్యాహ్నం మొదలయ్యే హైదరాబాద్ మేయర్ ఎన్నికలలో అన్ని సస్పెన్షన్ల కు తెర దించినట్లే.

 

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju