NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

Veligonda : ప్రకాశం జిల్లా దాహం తీరినట్లే!

Veligonda : ప్రకాశం జిల్లా కూ వరప్రదాయిని వెలుగొండ. అత్యంత తక్కువ వర్షపాతం ఉండే ఈ జిల్లాకు ఎప్పుడు సాగు తాగునీటి కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఈ జిల్లా మొత్తం కరువును సాగునీటి తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రతిపాదించింది వెలుగొండ ప్రాజెక్ట్. మూడు దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. ప్రాజెక్టు లో అత్యంత కీలకమైన సొరంగాలను పూర్తి చేసే పనులు చివరికి వచ్చాయి.

almost-finish-for-veligonda-project
almost-finish-for-veligonda-project

Veligonda 1994లో సమగ్ర నివేదిక 

కృష్ణా నదీ జలాలను ప్రకాశం జిల్లాకు తరలించాలని అదే ఈ ప్రాజెక్టు అసలు ఉద్దేశం. దానికనుగుణంగా సమగ్ర నివేదికను 1994లో సిద్ధం చేశారు. 1996 నాటికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్టు కోసం మొదటిసారి శంకుస్థాపన జరిగింది. అయితే ఆ తర్వాత పనులు ఏవి ముందుకు సాగలేదు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వెలుగొండ ను సైతం పెట్టారు. దీంతో మరోసారి ఆయన శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి ఈ ప్రాజెక్టు లో కాస్త పురోగతి కనిపించింది.

ఇది ప్రాజెక్ట్ అసలు లక్ష్యం

కృష్ణానదిలో వరదల సమయంలో వందల టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. గడిచిన రెండేళ్లలో నే మొత్తం 1500 టీఎంసీల నదీజలాలు వృథాగా వెళ్లిపోయాయి. ఎలా వృధా అయ్యే వరద నీటిని కిందికి పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవడమే వెలుగొండ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. శ్రీశైలం జలాశయం సమీపంలో సంవత్సరములు 45 రోజులు వరద ప్రభావం ఉంటుందని అంచనా. ఆ సమయంలో మిగులు జలాల్లో కనీసం నలభై మూడు టీఎంసీల నీటిని పొలం వాగు ద్వారా రెండు సోరంగ మార్గాలకు మళ్ళించి, అక్కడి నుంచి వరద కాలువ ద్వారా నల్లమల శ్రేణుల సమీపంలోని సుంకేసుల, గొట్ట పడియ, కాకర్ల వద్ద జలాశయం నిర్మించి అక్కడినుంచి సాగు తాగునీటి అవసరాలను ప్రకాశం జిల్లాకు తీర్చాలి అనేదే ప్రణాళిక.

సొరంగాలు తవ్వడం లోనే ఎడతెగని జాప్యం

వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి ప్రధానంగా సొరంగమార్గాలు కావడమే ప్రధాన జాప్యం గా కనిపించింది. 18.8 కిలోమీటర్ల మేర అత్యంత దుర్భరమైన ప్రదేశంలో సొరంగాలను తవ్వాలి ఉంది. రెండు స్వరంగాలు నల్లమల అడవుల మధ్యలో కొండను తవ్వి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ టనల్స్ ను కొల్లం వాగు చేర్చేందుకు సుదీర్ఘ ప్రయత్నం చేసారు. మొదటి సొరంగ మార్గం ద్వారా 10.7 టీఎంసీల నీటిని తరలించేలా నిర్మాణం చేశారు. 7 మీటర్ల వెడల్పుతో ఈ టన్నేల్ ద్వారా శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల పాటు నీటిని తరలించవచ్చు. ఇక రెండవ టన్నెల్ అత్యంత క్లిష్టమైనది.

దీనిని మొదటి స్వరంగం కంటే రెండు రెట్లు ఎక్కువ సామర్థ్యంతో తవ్వరు. 9.2 మీటర్ల వ్యాసార్థం తో సుమారు 33 టి.ఎం.సి ల నీటిని తరలించేందుకు దీనిని సిద్ధం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు లో వరద సమయంలో బ్యాక్ వాటర్ ను కొల్లం వాగు నుంచి టన్నెల్ లో కి తరలించి అక్కడి నుంచి మరో 20 కిలోమీటర్ల పాటు వరద కాలువ ద్వారా కృష్ణాజలాలను వెలిగొండ ప్రాజెక్టు కు తరలిస్తారు. ప్రాజెక్టు నుంచి సాగునీటి కాలువల ద్వారా ప్రకాశం మొత్తానికి నీటిని మళ్లించి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలకు చెందిన 30 మండలాలకు సాగు నీటి ప్రయోజనం దక్కుతుంది. అలాగే 16 లక్షలమందికి వరకూ తాగునీటి సమస్య తీరుతుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను అధిగమించేందుకు నల్గొండ ప్రాజెక్ట్ మీరు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

నిధులు లేవు యంత్రాలు లేవు

వెలుగొండ ప్రాజెక్టు పనులు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఊపందుకున్న ఎప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడంలో జాప్యం చేయడంతో ఈ ప్రాజెక్టు పూర్తిగా అటకెక్కింది. తర్వాత ప్రాజెక్టులో సొరంగాలను తవ్వడానికి అనువైన సాంకేతికత లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. ఇటీవల జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా సంస్థకు ఈ టన్నల్ తవ్వకం బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి మెరుపువేగంతో పనులు మొదలయ్యాయి. ఇప్పటికే మొదటి సొరంగం పనులు పూర్తయితే రెండు సొరంగం పనులు శరవేగంగా సాగుతున్నాయి.

18.8 కిలోమీటర్ల మేర కాలువ సిద్ధమైంది. దీంతో మొదటి సొరంగం నుంచి నీటిని తీసుకునేందుకు వెసులుబాటు వచ్చింది. దీంతో వచ్చే ఖరీఫ్ నాటికి ప్రకాశంకు వెలిగొండ నుంచి నీరు అందే అవకాశం కనిపిస్తోంది. ఇక రెండో టన్నెల్ 11.5 కిలోమీటర్ల పొడవున తవ్వకం పూర్తయినట్లు తెలుస్తోంది. అంటే మరో ఏడు కిలోమీటర్ల పనులు పూర్తయితే రెండు సొరంగం కూడా అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఏకంగా సుమారు నలభై మూడు టీఎంసీల నీటిని వెలుగొండ కు తరలించేందుకు మార్గం ఏర్పడుతుంది. అదే కనుక జరిగితే ప్రకాశం జిల్లా పూర్తిగా ఒడ్డున పడినట్లే. ఇటు నెల్లూరు కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు నీరు అందుతుంది.

 

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju