NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda : ‘ఆ పాయింట్ మీద’ భయపడిన నిమ్మగడ్డ ? అందుకే సంచలన నిర్ణయం ?

Nimmagadda : ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల local body elections విషయంలో ప్రభుత్వం govt, ఎస్ఈసీ sec మధ్య పెద్ద వారే నడిచిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎన్నికలు వద్దు వద్దు అంటున్నా తన పదవీ కాలంలోపు ఎన్నికలు నిర్వహించే పోవాలన్న పట్టుదలతో ముందడుగులు వేశారు. చివరకు ప్రభుత్వం సుప్రీం కోర్టు వరకూ వెళ్లినా ఎస్ఈసీ నిర్ణయమే ఫైనల్ కావడంతో నిమ్మగడ్డ ప్రభుత్వంపై పైచేయి సాధించారు. అయితే పంచాయతీ ఎన్నికల ప్రారంభంలో కొంత ఎస్ఈసీకి ప్రభుత్వం నుండి సహకారం లోపించినా తరువాత సెట్ అయినట్లు కనబడింది. అధికార యంత్రాంగం పూర్తిగా సహాయ సహకారాలు అందించడంతో రెండు విడతల పోలింగ్ ప్రశాంతంగా పూర్తి అయింది. పంచాయతీ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకూ నోటిఫికేషన్ విడుదల చేయవచ్చన్న వార్తలు వచ్చాయి. ఇందుకు తగినట్లుగా ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సంసిగ్దత వ్యక్తం చేసింది. అయితే కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఎన్నికలను ఏ స్టేజీలో అయితే ఆగిపోయిందో ఆ స్టీజీ నుండే కొనసాగించాలని ఎస్ఈసీకి సూచించినట్లు సమాచారం.

Nimmagadda : muncipal notification
Nimmagadda : muncipal notification

దీంతో ఎస్ఈసీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 12 కార్పోరేషన్ లు, 75 మున్సిపాలిటీలకు మార్చి 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పక్కన బెట్టి ఊహించిన విధంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పురపాలక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఎస్ఈసీ ఈ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. నాడు అధికార పార్టీ బలవంతంగా నామినేషన్ లను ఉపసంహరింపజేశారని, పూర్తిగా పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని విపక్షాలు ఎస్ఈసీని కోరాయి. అయితే పాత నోటిఫికేషన్ రద్దు చేస్తే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు, వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. వారు కోర్టుకు వెళితే ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు వస్తుందన్న గ్యారెంటీ లేకపోగా ఇంకా జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు ఇటీవల నిమ్మగడ్డకు న్యాయస్థానంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎమ్మెల్యేలపై ఎస్ఈసీ ఉత్తర్వులు ఇస్తే హైకోర్టు నుండి అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. తాజాగా రేషన్ డోర్ డెలివరీ వాహనాల విషయంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఇవన్నీ గమనించిన నిమ్మగడ్డ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటం కోసమే మున్సిపల్ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపణలు సంధించడం మొదలు పెట్టాయి. దీంతో కొంత వరకు విపక్షాలను సంతృప్తిపర్చడం కోసం స్క్రూటినిలో ఆమోదించిన తరువాత బలవంతంతో ఎవరైనా నామినేషన్ లు ఉపసంహరించామని వస్తే వారి నామినేషన్ లను పరిగణలోకి తీసుకోవాలంటూ ఆర్ ఓలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు.

 

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?