NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

Janasena : పవన్ కు ఓ మంచి సేనాని దొరికినట్లేనా??

Janasena : మొదటి నుంచి పార్టీ నిర్మాణం విషయంలో అటు బయటి వారి నుంచి ఇటు పార్టీ వ్యక్తుల నుంచి కూడా రకరకాల విమర్శలు ఎదుర్కొంటున్న జనసేన పార్టీ ఇప్పుడు పూర్తి పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జనంలో సైతం రెగ్యులర్గా తిరిగేందుకు, పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఎప్పటికప్పుడు కలుసుకునేందుకు ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ఉపయోగ ఆవిరి జిల్లాలపై పార్టీ గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏదైనా పెద్ద కార్యక్రమం అయితేనే కనిపించే నాయకగణం ఇప్పుడు తరచూ పార్టీ కార్యక్రమాలను పెడుతూ తమ వెంట వచ్చేవారిని కలుపుకుపోతు వెళ్తున్నారు.

ముఖ్యంగా సినిమాల్లో బిజీగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు నాదెండ్ల మనోహర్ రూపంలో మంచి సేనాని దొరికినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలో నెంబర్ టూ గా అందరికీ పరిచయమైన నాదెండ్ల అదే ఊపుతో ఇప్పుడు పార్టీ నాయకులను సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించే అవకాశం పవన్కు లేకపోవడంతో తన ప్రతినిధిగా, పార్టీలో కీలక వ్యక్తిగా, నిర్ణయాలను సైతం తీసుకుని సౌలభ్యం నాదెండ్ల మనోహర్ కు ఇవ్వడంతో ఆయన పార్టీ పరంగా తరచూ కార్యక్రమాల్లో పాల్గొనడం కనిపిస్తోంది.

Janasena
Janasena

Janasena పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్!

గత ఏడాది స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడిన అప్పటి పరిస్థితి కంటే ప్రస్తుతం జనసేన పార్టీ పరిస్థితి కాస్త మెరుగుపడింది. పంచాయతీ ఎన్నికల్లో అయితే ఊహించని రీతిలో ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పార్టీ చరిష్మా గణనీయంగా పెరిగినట్లు అర్థం అవుతోంది. ఇప్పటివరకు పార్టీ భావజాలం కేవలం నగరాలు పట్టణాల్లో మాత్రమే పరిమితమైంది అని పార్టీ నాయకులు సైతం భావించారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో సైతం పార్టీ బలంగా ఉందని మరోసారి నిరూపితం అవడంతో పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేయడమే ముందున్న లక్ష్యంగా పార్టీ నాయకులు భావిస్తున్నారు.

దీనిలో భాగంగానే నాదెండ్ల మనోహర్ ఇప్పుడు రోజువారీ క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఏదైనా పెద్ద విషయం కానీ, పార్టీ తరఫున పెద్ద కార్యక్రమం గాని చేస్తే పవన్ కళ్యాణ్ వచ్చేలా ప్లాన్ చేశారు.
** దాదాపు పార్టీ నిర్మాణం అంతా నాదెండ్లమనోహర్ చూస్తున్నారు. మండలాల వారీగా గ్రామ కమిటీలు ఎంత మేర చేస్తున్నది ఆయన పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో మంచి ఓట్లు రాబట్టిన నియోజకవర్గాల్లో వాటిని పూర్తిస్థాయిలో పటిష్ట పరిచి కార్యాచరణ సాగుతోంది.

** మరోపక్క జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి లు బలంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తో పోలిస్తే జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కొన్నిచోట్ల బలంగా కనిపిస్తున్నారు. తాడేపల్లిగూడెం, అమలాపురం, పి గన్నవరం, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్ తదితర చోట్ల జనసేన పార్టీ ఇంచార్జ్ లు అన్నీ తానై నడిపించడం పార్టీలకు సానుకూల అంశం.

Janasena
Janasena

రాయలసీమ మీద దృష్టి పెట్టాలి

పంచాయితీ ఫలితాల్లో జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల్లో బలంగానే కనిపించినా రాయలసీమలో అసలు పార్టీ ప్రభావం కనిపించకపోవడం విశేషం. ఈ ప్రాంతంలోనూ నాయకులు ఉన్నప్పటికీ అక్కడ కనీస ఓట్లు రాబట్టలేకపోయింది. తమకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల పైనే పార్టీ దృష్టి పెడుతోంది తప్పితే, రాయలసీమ మీద ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు.

పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తే నే అక్కడ కనీసం ఓటింగ్ శాతం అయినా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇతర స్థాయి పర్యటనలో ఉన్న నాదెండ్ల మనోహర్ సైతం అటుగా వెళ్తారా లేక ఉభయ గోదావరి జిల్లాల తోనే సరిపెడతారా అన్నది చూడాలి.

Related posts

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌