NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Chandrababu Naidu: ఇప్పుడైనా కార్యకర్తల మాటలు వింటారా..? కుప్పంలో ప్రక్షాళన ఉంటుందా..?

Chandrababu Naidu.. కు పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా కుప్పంలో తగిలిన షాక్ చాలా పెద్దది. ఎంతగా అంటే.. ఎన్నికలు ముగిసి నాలుగు రోజులు అయ్యాయో లేదో.. ఆయన కుప్పం పర్యటనకు వెళ్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి మూడు రోజులపాటు ఆయన కుప్పం నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. అయితే.. ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది నేతలతో సమావేశాలు కాదు. కార్యకర్తలతో. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం లేకపోతే పార్టీల పునాదులే కదిలిపోతాయి. ఇప్పుడు కుప్పంలో జరిగింది ఇదే. పంచాయతీ ఎన్నికలంటే పార్టీ గుర్తులు లేకపోయినా ప్రజాబలం ఎంతుందో చెప్పే అంచనాలు. ఇక్కడే పట్టు కోల్పోతే పార్టీకి ప్రమాదం. జరగరాని డ్యామేజీ చంద్రబాబుకు అక్కడే జరిగింది. దీంతో అధినేత వెంటనే కదిలారు. తనకు కంచుకోట లాంటి కుప్పంలో టీడీపీ కాదు.. కార్యకర్తలు కుదేలయ్యారనే వార్త ఆయన్ను తీవ్రంగా కలచివేసింది.

Chandrababu Naidu
Chandrababu Naidu

 

Chandrababu Naidu  కార్యకర్తల మాటలు వింటారా?

చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మాటలు.. ‘కార్యకర్తలే పార్టీకి బలం. తమ్ముళ్లూ.. మీకు నేను ఉన్నాను. యువత పార్టీలోకి రావాలి. యాక్టివ్ కావాలి. యువతకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. యువతతోనే పార్టీ భవిష్యత్తు’ ఇవే. అయితే.. ఇవన్నీ ఆచరణలోకి వస్తాయా అంటే పార్టీలోని నేతలు, కార్యకర్తలు నమ్మలేని పరిస్థితి. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు.. 2014లో వచ్చిన వెంటనే మాయం అయ్యాయి. పార్టీలో సీనియర్లకే పట్టం కట్టారు. ప్రభుత్వంలో యువతకు పట్టం కట్టకపోయినా పార్టీ కార్యకలాపాల్లో అయినా ఇస్తారా అంటే అదీ ఉండదు. అక్కడా పార్టీకీ, వయసులో ఉన్న సీనియర్ల మాటే చెల్లుబాటు. కొత్తకొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువత క్షేత్రస్థాయిలో పనులకు ఉండిపోతారు. ఇప్పుడిదే యువత పార్టీని గ్రామాగ్రామన మోయాలని చూసినా ఫలితం లేకపోతోంది. చంద్రబాబు చుట్టూ ఉండే నేతలు కార్యకర్తల సమస్యలు, గ్రామాల్లోని సమస్యలు తీసుకెళ్లనివ్వరు. చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీనే అంతా చూసుకుంటుంది. వీరు చెప్పే మాటలే చంద్రబాబు పాటిస్తారు. దీంతో కార్యకర్తలు చెప్పాలనుకున్నది ‘నాకు తెలుసు’ అని భరోసా ఇస్తారు. మళ్లీ షరా మామూలే.

 

చంద్రబాబు కోటరీ దాటుతారా..?

కుప్పంలో చంద్రబాబుకు పెద్ద కోటరీనే ఉంది. మునిరత్నం, గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు పీఏ మనోహర్.. ఇలా వీరిదే రాజ్యం. వీరి కనుసన్నల్లోనే పార్టీ నుడుస్తుంది. కార్యకర్తలకు సమస్యలు.. గ్రామాల్లో పార్టీ అభివృద్ధి, నియోజకవర్గంలో అభివృద్ధి అంతా వీరే చూసుకుంటారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు బాగానే నడిచింది. చంద్రబాబు అక్కడకు వచ్చింది కూడా తక్కువే. 2019 ఎన్నికల ప్రచారానికి కూడా రాలేదు. కారణం.. అక్కడ టీడీపీకి బలం ఎక్కువ. కానీ.. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిపోయింది. 89 పంచాయతీలకు 74 వైసీపీ గెలుచుకోవడం ఏకంగా చంద్రబాబుకే ఖంగు తినిపించింది. దీంతో రీసెంట్ గా కుప్పంలో జరిగిన అంతర్గత సమావేశంలో మీదే తప్పు.. కాదు మీదే తప్పు అంటూ నేతలు కార్యకర్తలు అరుచుకుని ఆరోపణలు చేసుకుకునేంత వరకూ వెళ్లింది. కొందరు పార్టీకి రాజీనామా కూడా చేయబోయారు. జరిగిన నష్టం పునరావృతం కాకూడదనే చంద్రబాబు పర్యటన ఏర్పాటు చేశారు. అయితే.. ఈసరైనా చంద్రబాబు కార్యకర్తల ఇబ్బందులు, క్షేత్రస్థాయి సమస్యలు. పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకుంటారా అనే ప్రశ్న సగటు కుప్పం టీడీపీ కార్యకర్తల్లో ఉంది.

 

కుప్పం సమస్యలు పరిష్కారమవుతాయా?

అధినేత ప్రసంగం, నాయకుల ప్రసంగాలే కాకుండా కార్యకర్తల సమావేశాలు కూడా ఉంటేనే పార్టీకి లాభం. వైసీపీ గెలిచింది కాబట్టి ప్రజాస్వామ్యం ఓడిపోయింది.. తాము గెలిస్తే మన కష్టం గెలిపించి వంటి డైలాగులు చంద్రబాబు పక్కనపెట్టాలి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ క్షేత్రస్థాయి పరిస్థతులు తెలుసుకోకుండా టెక్నాలజీపైనే ఆధారపడ్డారు. ఆ ర్యాంకులను చూసుకుని తామే అధికారంలోకి వస్తామని భ్రమించి భంగపడ్డారు. కుప్పంలో కూడా జరుగుతోంది అదే. అధికారంలో ఉన్నప్పుడు పనులు చేశాం.. సంపాదించాం.. ఇప్పుడు ఎన్నికల్లో కాస్త ఖర్చు పెట్టుంటే పరిస్థితి వేరేలా ఉండేదిని కుప్పం నాయకుల్లోనే అనుకుంటున్నారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో తెలుస్తోంది. కష్ట సమయంలో, అధికారంలో లేని సమయంలో కాకపోతే మరెప్పుడు అనే వాదన వారిలో ఉంది. మరి ఈ సమస్యలన్నింటినీ చంద్రబాబు వింటారా.. లేక ఇలా చేయండి.. నేనున్నాను.. అంతా నాకు తెలుసు.. అంటూ సమావేశాలు ఇచ్చి ఊరుకుంటారా చూడాలి. అలా కాకుండా.. తన కోటరీని పక్కనపెట్టి కుప్పం నేతల్లో పెరిగిన గ్యాప్ ను ఈ మూడురోజుల్లో తెలుసుకుని ముందుకెళ్తే

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju