NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila : వాయిస్ పెంచేసిన షర్మిల!అన్నతో సహా ఏ ఒక్కరినీ వదలకుండా కామెంట్లు!

YS Sharmila Party: నిజమా..! షర్మిల పార్టీ వెనుక ఇంత కథ ఉందా..!?

YS Sharmila : తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సోదరుడు జగన్ తెలంగాణలో బాగా బలంగా ఉన్న టీఆర్ఎస్ బీజేపీలను ఆమె టార్గెట్ చేశారు . తాను పార్టీ పెట్టడం తన సోదరుడు ఏపీ సీఎం జగన్‌కు ఇష్టం లేదని అన్నారు. తనకు రాజకీయ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదో జగన్ నే అడగాలన్నారు. తెలంగాణా ప్రయోజనాలే తనకు ముఖ్యమని..ఇక్కడ కొందరు మతంపేరుతో.. ఇంకొందరు ఉద్యమం పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

Voice raised YS Sharmila! Comments without leaving anyone including Anna!
Voice raised YS Sharmila! Comments without leaving anyone including Anna!

పార్టీ వివరాలు త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తానని.. ప్రతి అమరవీరుల కుటుంబం తలుపు తడుతానని ఆమె వివరించారు. తెలంగాణాలో ప్రతిపక్షం సమర్ధవంతంగా పనిచేయడంలేదని… అందుకే ఫామ్ హౌజ్ నుంచే పాలన సాగుతోందని విమర్శించారు. పెద్ద పెద్ద బడా నాయకులే అవసరంలేదని… మంచి నాయకులు ఎవరు తమపార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు షర్మిల.

YS Sharmila : నేను తెలంగాణ పక్కా లోకల్!

తన స్థానికతపై వస్తున్న విమర్శలపైనా షర్మిల స్పష్టత ఇచ్చారు. మీడియాతో ఆమె చిట్‌చాట్‌ నిర్వహించారు. తెలంగాణలోనే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే పిల్లలను కన్నాను. సీఎం కేసీఆర్‌, బీజేపీ నేత విజయశాంతి ఎక్కడ పుట్టారు?’’ అని ప్రశ్నించారామె. తాను ఎవరూ వదిలిన బాణం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టడం సీఎం జగన్‌కు ఇష్టం లేదని వెల్లడించారు. జగన్‌తో తనకున్నవి పార్టీ పరమైన విభేదాలు మాత్రమేనని చెప్పారు. తనకు ఎందుకు వైసీపీలో ప్రాధాన్యత ఇవ్వలేదో జగన్‌ను అడగాలని, తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని మరోసారి షర్మిల స్పష్టం చేశారు.హైదరాబాద్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని.. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని మరోసారి స్పష్టం చేశారు.. దివంగత మాజీ సీఎం జయలలిత ఎక్కడ పుట్టి, ఎక్కడ సీఎం అయ్యారో అందరికీ తెలుసని చెప్పారు.

టీఆర్ఎస్ ..బీజేపీల పై మాటల ఈటెలు!

ఉద్యమం అంటూ ఒకరు.. మతం అంటూ మరొకరు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. తెలంగాణ అభివృద్ధిపై ఎవరికీ చిత్తశుద్ధిలేదని ఆక్షేపించారు. అతిత్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్‌ను ఎదురించడానికైనా సిద్ధమని స్పష్టత ఇచ్చారు. పోలవరం నుంచి పోతిరెడ్డిపాడు దాకా తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నారు. తెలంగాణలో రాజన్న పథకాలనే కాపీ కొట్టారని షర్మిల ఆరోపించారు.‘

తల్లి విజయమ్మ నావైపే!

తెలంగాణలో వైసీపీ ఎక్కడుందని ప్రశ్నించారు షర్మిల. పార్టీ ఏర్పాటులో తన భర్త అనిల్, తల్లి విజయమ్మల సహాకారం ఉందన్నారు. కోవిడ్‌ సమయంలో ఆస్పత్రులు లక్షలు వసూలు చేశాయి. ఆస్పత్రుల దోపిడీపై సీఎం కనీసం దృష్టిపెట్టలేకపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచే పార్టీ ప్రస్థానం మొదలవుతుందని స్పష్టం చేశారు షర్మిల.

 

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N