Children : పిల్లలు ఇలా బెట్టు చేస్తున్నపుడు సహజం గా మనం కఠినం గా మాటాడటం లేదా వారిని విసుక్కోవడం లేదా తిట్టడం చేస్తుంటాము. అలా చేయడం వల్ల వారు ఇంక మొండిగా ప్రవర్తిస్తారు. కాబట్టి వారికీ ప్రేమ తో నచ్చచెప్పండి. ప్రేమగా చెప్తే పిల్లలు ఏదైనా చక్కగా వింటారు. కాకా పోతే అలా చెప్పేంత ఓపిక మనం పెంచుకోవాలి. వారు పేచీ పెడుతున్నారు , ఏడుస్తున్నారు అని అది ఆపడానికి వారు ఏమి అడిగిన ఒప్పుకోవడం,ఇచ్చేయడం వంటివి చేయకూడదు.అలా ఒక్కసారి చేసారంటే ఇక వారికీ ఏమికావాలన్న సరే ఇలా మొండికేస్తే చాలు ఇచ్చేస్తారు. అని వారి మనసులో నాటుకు పోయి ప్రతి దానికి మొండికేసేస్తూ ఉంటారు.
పిల్లలకు వివరం గా ఈ విధం గా చెప్పండి.. వారికీ వారు ఇలా బెట్టు చేస్తూ మంచి పిల్లలు గా ఉండకపోతే బొమ్మలు కొనివ్వను అని లేదా వారికీ నచ్చింది ఏదైనా ఇవ్వను అని చెప్పండి. ఆ భయం తో అయినా వారు పేచీలు మానేస్తారు. లేదా మంచి పిల్లలు గా ఉంటే ఇంక ఎక్కువ చాక్లేట్లు కొనిస్తాను అని లేదా వారు ఇష్టపడేది ఏదైనా ఇస్తాను అని చెప్పి చూడండి. ఇలా మొండిగా ఉన్న ,చెప్పినట్టు చేయకపోయినా చిన్న పిల్లలు కదా పెద్ద అయ్యాక వారే తెలుసుకుంటారు లే అని వదిలేయడం మాత్రం చాల పొరపాటు అని గుర్తుపెట్టుకోండి..
వారుఎదుగుతున్నప్పుడే మీరు ఏది నేర్పిన నేర్చుకుని జీవితాంతం అనుసరిస్తూ ఉంటారు అని మరువకండి. ఈ రోజు మీరు వారిని దిద్దు కోక పొతే వారు జీవితం లో చాల కోల్పోవాలిసి వస్తుంది. వారిని పేమగా చూడండి. గారం తో కాదు. కఠినమైన మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా ప్రేమతో వారిని తీర్చి దిద్దుకోండి.