NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vijayawada : కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్ వాడీ ఆయా మృతి..?

Covaxine: Where is 4 Cr Doses..?

Vijayawada : దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుండగా అక్కడడక్కడా వ్యాక్సిన్ తీసుకున్న పలువురు అస్వస్థతకు గురి అవుతున్నారు. కొందరు ఒకటి రెండు రోజుల్లో చికిత్స అనంతరం కోలుకుంటున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారు కోలుకోవడానికి వారం పది రోజులు పడుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అయిదుగురు ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయినా వారి మరణాలకు వ్యాక్సిన్ దుష్ప్రభావం కారణం కాదంటూ వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత మృతి చెందిన వారికి రూ.50లక్షల వరకూ ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరు చేస్తోంది. ఇటీవల కడప, అంతకు ముందు గుంటూరు జిల్లాలో ఆరోగ్య కార్యకర్త, అంగన్ వాడీ టీచర్ మృతి చెందిన ఘటనలు మరవక ముందు తాజాగా విజయవాడలో ఓ అంగన్ వాడీ ఆయా మృతి చెందింది. ఆమె మృతికి వ్యాక్సిన్ దుష్ట్రభావమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Vijayawada anganvadi helper lost life
Vijayawada anganvadi helper lost life

విజయవాడ సనత్ నగర్ లో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ వికటించి ఓ అంగన్ వాడీ ఆయా మృతి చెందింది. స్థానిక అంగన్ వాడీ సెంటర్ లో ఆయా పని చేసే బుల్ షాద్ బేగం (32) గత నెల కరోనా మొదటి డోస్ వేయించుకున్నది. ఈ నెల 20వ తేదీ రెండవ డోస్ వేయించుకోవాల్సి ఉండగా ఆ రోజు వీలు కుదరక ఈ నెల 24వ తేదీన కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకుంది. ఆ మరుసటి రోజు నుండి ఆమె అస్వస్థతకు గురైంది. ఆమెతో వ్యాక్సిన్ వేయించుకున్న వారు అందరూ సాధారణ ఒళ్లు నొప్పులు వచ్చి పోయాయని అంటున్నారు.

బుల్ షాద్ బేగంకు గతంలో ఎటువంటి అనారోగ్యం లేదనీ, తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు ఎటువంటి సమస్యలు రాకపోవడంతో ధైర్యంగా వెళ్లి రెండవ డోస్ వేయించుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేయాలని స్థానిక నేతలు, బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మైనార్టీ ముస్లిం సంప్రదాయ నేపథ్యంలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి తొలుత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా వ్యాక్సిన్ వల్ల మృతి చెందిందో లేదో తెలుసుకోవాలంటే పోస్టుమార్టం తప్పనిసరి అని స్థానిక నేతలు కుటుంబ సభ్యులను ఒప్పించారు.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju