NewsOrbit
టాప్ స్టోరీస్ తెలంగాణ‌ న్యూస్

Sarpanch : ఆ సర్పంచ్ మామూలోడు కాదు..! ఆయన చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Sarpanch : వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న రెవెన్యూ ఇతర శాఖల అధికారులు లంచాలు తీసుకుంటుండగా లేనిది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన తాను లంచం తీసుకుంటే తప్పేముంది అనుకున్నాడో ఏమో కానీ ఓ గ్రామ సర్పంచ్ లక్షలాది రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ వార్త తెలంగాణలో తీవ్ర కలకలాన్ని కల్గించింది. గత ఏడాది తెలంగాణలో రెవెన్యూ ఒకరు కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడిన ఉదంతం రెవెన్యూ వర్గాలను కుదిపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ సర్పంచ్ బాగోతం వెలుగులోకి వచ్చింది.

Sarpanch demands 20 lakh bribe
Sarpanch demands 20 lakh bribe

విషయంలోకి వస్తే…వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన ఓ భూ యజమానికి వంద ఎకరాలకు పైగా పొలం ఉంది. ఆ భూమి మన్నెగూడ చౌరస్తా సమీపంలో ఉంది. ఇప్పటి వరకూ ఆ పొలంలో పండిస్తున్న ఆ భూ యజమాని ఇటీవల ఆ స్థలంలో ప్రధాన రహదారి వైపు 20 దుకాణాలతో ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని ఆలోచన చేశాడు. తన సొంత వ్యవసాయ భూమిలో షాపులు కట్టుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదని భావించి షాపుల నిర్మాణం చేపట్టాడు. ఈ విషయం గ్రామ సర్పంచ్ కి తెలిసింది. వెంటనే పనులు ఆపమని చెప్పాడు.

షాపులు నిర్మించాలంటే పంచాయతీ అనుమతి తీసుకోవాలని అతనికి చెప్పాడు. పంచాయతీకి అనుమతుల కొరకు ధరఖాస్తు చేస్తానని అతను సమాధానం ఇచ్చాడు. ధరఖాస్తు ఇస్తే అనుమతులు ఇవ్వడం కుదరదు, అందుకు 20 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు సర్పంచ్. అంత మొత్తం ఇచ్చుకోలేనని రూ.15 లక్షల వరకూ ఇచ్చుకుంటానని సర్పంచ్ బేరం కుదుర్చుకున్నాడు భూ యజమాని. ఆ తరువాత ఆ భూ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించి తనను సర్పంచ్ 20 లక్షలు లంచం అడిగిన విషయంపై ఫిర్యాదు చేశాడు. ఎసీబీ అధికారులకు మంచి కేసు దొరకడంతో వెంటనే సర్పంచ్ ను రెడ్ హాండెడ్ గా పట్టుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలో భూ యజమాని సర్పంచ్ కి ఫోన్ చేసి రాజేంద్ర నగర్ సమీపంలోని షాదాన్ కళాశాల వద్దకు వస్తే డబ్బులు ఇస్తానని తెలియజేశాడు.

ప్లాన్ ప్రకారం భూ యజమాని షాదాన్ కళాశాల వద్దకు చేరుకున్న సర్పంచ్ కి కారులో రూ.13 లక్షలు నగదు ఇస్తుండగా అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న ఏసీబీ అధికారులు సర్పంచ్ ని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. సర్పంచ్ పై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో ఇలాంటి అవినీతి దందాలు నిత్యకృత్యం అయ్యాయి. కాకపోతే చాలా వరకు వెలుగు చూడటం లేదు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?