NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

West bengal Elections : బీహార్ ఫార్ములాతోనే బెంగాల్ బరిలో బీజేపీ..! ముస్లిం ఓట్ల కోసం ఎత్తులు – కత్తులు..!?

West bengal Elections : ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నెల 27 న తొలిదశ పోలింగ్ జరగనుండగా… ఏప్రిల్ నెలాఖరున చివరి దశ పోలింగ్ జరగనుంది. మే రెండో తేదీన ఫలితాలు రానున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ తన పార్టీ తరపున పోటీ చేయనున్న 291 మంది జాబితాను విడుదల చేయగా… బీజేపీ కూడా సిద్ధం చేస్తుంది. బెంగాల్ అంటే ముస్లింలు. వారి ఓట్లే గెలుపుని శాసిస్తాయి. వారి నియోజకవర్గాలు బెంగాల్లో సీఎం పీఠాన్ని అందిస్తాయి. గడిచిన రెండు ఎన్నికల్లో మమతా బలం ఆ ముస్లిం ఓట్లే..! కానీ ఇన్నాళ్లు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. బెంగాల్ లో ముస్లిం ఓట్లు కోసం బీజేపీ ప్లాన్ – ఏ.., ప్లాన్ – బీ రెడీ చేసుకుని పోటీలోకి దిగుతుంది..!!

West bengal Elections : BJP Ready with Bihar Plan
West bengal Elections : BJP Ready with Bihar Plan

West bengal Elections : 110 నియోజకవర్గాలు వారివే..!!

పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 శాసనసభ స్థానాలున్నాయి. మొత్తం ఓటర్లలో 30 శాతం ముస్లిం ఓట్లు ఉంటాయి. సుమారుగా 110 నియోజకవర్గాల్లో గెలుపు / ఓటములు డిసైడ్ చేసేది ముస్లిం ఓటర్లే. అందుకే వారి ఓట్లపై పార్టీలు కన్నేశాయి. 2011 ఎన్నికల్లో మమతా బెనర్జీకి ముస్లింలు 75 శాతానికి పైగా మద్దతు పలికారు. 2016 లో కూడా ఆమెకు వారే అండగా నిలిచారు. అందుకే ఆమె కూడా ముస్లింల కోసం ప్రత్యేకత పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల ఇమామ్లకు నెలకు రూ. 2500 గౌరవ వేతనం ఇవ్వడం, ముస్లిం పాఠశాలల ఏర్పాటు, వారి బాలికలకు సైకిళ్ళు ఇవ్వడం.., ఇలా ముస్లింల కోసం పలు కొత్త ఆలోచనలు చేస్తూ… వారి ఓట్లను మమతా ఒడిసిపట్టారు. పనిలో పనిగా మంత్రి వర్గంలో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.

West bengal Elections : BJP Ready with Bihar Plan
West bengal Elections : BJP Ready with Bihar Plan

బీహార్ తరహా ఫార్ములాతో బీజేపీ..!!

బీహార్లో కూడా ముస్లిం ఓట్లు 20 శాతం మేరకు ఉంటాయి. దాదాపు 45 నియోజకవర్గాల్లో ప్రభావితం చూపుతాయి. అంటే ఆ ఓట్లు ఎవరిని అయినా గెలిపించగలవు.., లేదా ఓడించగలవు..! సో… బీహార్ లో ముస్లిం ఓట్లను ఎంఐఎం రూపంలో బీజేపీ గాలం వేసింది. అవకాశం ఉన్న చోట ఎంఐఎం గెలిచింది… గెలిచే బలం లేని చోట బలమైన ప్రత్యర్థి ఓట్లు చీల్చింది. తద్వారా కొన్ని అదనపు సీట్లు బీజేపీకి వచ్చాయి. అందుకే 2015 లో 53 స్థానాలు గెలిచినా బీజేపీ… 2020 నాటికి 74 సీట్లు గెలుచుకుంది… ఎంఐఎం కూడా 5 గెలిచి… జాతీయ పార్టీగా మారిపోయింది. సో.. ఇదే తరహా ఫార్ములాను బీహార్ లో ప్రయోగించడానికి బీజేపీ – ఎంఐఎం ప్లాన్ వేస్తున్నాయి. ఎంఐఎంకి గెలిచే అవకాశాలు ఉన్న చోట మంచి అభ్యర్థులను దించి గెలిపించుకోవడం.. ఆ అవకాశం లేని చోట మమతా బెనర్జీ పెట్టిన అభ్యర్థులను ఓడించడం… తద్వారా బీజేపీకి లాభపడేలా చేయడం..!! బీహార్ అంటే తొలిసారి కాబట్టి ఈ ఫార్ములా, సెంటిమెంట్ వర్కవుట్ అయింది. కానీ బెంగాల్ పరిస్థితులు వేరు. అక్కడ ముస్లింల ఆలోచనలు వేరు, అవసరాలు వేరు. అవన్నీ మమతకు బాగా తెలుసు. అందుకే బీజేపీ ప్లాన్ ఎంత మేరకు ఫలిస్తుంది..? అనేది ప్రస్నార్ధకమే. ఇప్పటికే ముస్లింల పెరికె విమర్శలు, వ్యాఖ్యలు, కొన్ని ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

West bengal Elections : BJP Ready with Bihar Plan
West bengal Elections : BJP Ready with Bihar Plan

* ముస్లింల ప్రభావం ఉన్న మొత్తం 110 స్థానాలను పక్కన పెడితే మిగిలిన 184 స్థానాల్లో కూడా మమతకు ఈజీగా వంద స్థానాల్లో గట్టి పట్టు ఉంది. అందుకే బీజేపీ ముస్లిమ్ ఇతర స్థానాల్లో కనీసం 120 గెలవాలని.. ముస్లిం ప్రభావం ఉండే చోట్ల ఎంఐఎం వలన వచ్చే చీలిక ద్వారా కనీసం 50 సీట్లు గెలవాలని ప్లాన్ వేసుకుంటుంది. కానీ అక్కడ మమతా ఆ పక్కనే పీకే ఉన్నారు. ఇవన్నీ పసిగట్టలేని పసివాళ్లు కాదు. ఇటు అమిత్ షా వంటి దేశం మొత్తం శాసించగల రాజకీయ చాణక్యుడు.. అటు నాయకుల బలహీనతతో రాజకీయం చేసే పీకే – మమతా వంటి కాంబినేషన్ తో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశాన్ని తమవైపునకు తిప్పుకున్నాయి..!

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju