Ravi – Lasya : గత ఐదు సంవత్సరాల క్రితం బుల్లితెరపై క్రేజీ యాంకర్స్ జోడిగా పేరు సంపాదించుకున్న జోడిలలో రవి_ లాస్య ఒకరు. ఏ టీవీ ప్రోగ్రామ్ చేసిన వీరిద్దరూ కలిసి జంటగా కనిపించేవారు. ఇద్దరూ ఎంతో సరదాగా మాట్లాడుతూ, పోట్లాడుతూ యాంకరింగ్ నిర్వహించటం వల్ల మంచి పేరును సంపాదించుకున్నారు.
ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తేడంతో ఎవరికి వారు విడిపోయారు. అనంతరం లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని,యూట్యూబ్ ఛానల్ లో ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు.
తాజాగా లాస్య బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేశారు. అయితే మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చిన లాస్య తర్వాత కెరియర్ పై శ్రద్ద పెట్టింది. ఈ క్రమంలోనే సంక్రాంతి సందర్భంగా స్టార్ మా లో ప్రసారమైన ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అని ప్రోగ్రాంలో తిరిగి లాస్య రవి ఇద్దరు కలిసి పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం సందర్భంగా విడిపోయిన వీరిద్దరూ మాట్లాడుకుంటారు. ఇకపై ఎప్పుడు పోట్లాడుకోకుండా ముందులాగే కలిసి ఉంటామంటూ ఈ క్రేజీ జోడి తెలిపారు. అయితే వీరిద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టి మూడు నెలలైనా కాలేదు తిరిగి గొడవ పడ్డారు.
Ravi – Lasya గొడవ మొత్తం ఆ ప్రోగ్రాం వల్లే:
ఎంతో అద్భుతంగా యాంకరింగ్ చేసే ఈ జంట ఎట్టకేలకు మాట్లాడుకుంటున్నారని ఆనందంలో ప్రేక్షకులు ఉండగా తిరిగి గొడవ పడడంతో ప్రేక్షకులలో తీవ్ర నిరాశే ఎదురయింది. అయితే వీరిద్దరూ గొడవ పడింది సీరియస్ గానా అంటే అస్సలు కాదు అని చెప్పవచ్చు. స్టార్ మాలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ అనే కామెడీ షో ప్రసారం అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ షో కి వర్షిని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీదేవి శేఖర్ మాస్టర్ జడ్జిగా ఉండే ఈ షోలో అవినాష్, అషు రెడ్డి, సుజాత, సిరి తదితరులు పాల్గొంటారు.
అయితే అప్పుడప్పుడు ఈ షోకి సెలబ్రిటీస్ హాజరై సందడి చేస్తుంటారు. ఇందులో భాగంగానే రవి లాస్య ఒక స్కిట్ చేయబోతున్నారు.ఉప్పెన స్పూఫ్ని వీరిద్దరు చేస్తుండగా.. ఒకరిపై ఒకరికి మాటల యుద్ధం జరిగింది. వీళ్ల నాన్న ఒక్క అబద్దం కూడా ఆడలేదేమోరా అందుకే ఇంత దరిద్రంగా పుట్టింది అని రవి, లాస్యను అనగా అర ఎకరం గురించి నువ్వు, నేనే మాట్లాడుకోవాలి అని లాస్య అనడం ప్రోమోకు ఎంతో హైలెట్గా నిలిచింది. వీరిద్దరి మధ్య సాగే ఈ సన్నివేశాలను పూర్తిగా చూడాలంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!